Chandrababunaidu-TDP: బాబుకి బెయిల్ వచ్చినా లాభం లేదా..?

Chandrababunaidu-TDP: బాబుకి బెయిల్ వచ్చినా లాభం లేదా..? ఇప్పుడు ఇదే అటు టీడీపీ వర్గాలలో గానీ, ఇతర పార్టీ నాయకుల్లో గానీ, ప్రజల్లో గానీ వినిపిస్తున్న మాట. ఎన్నో కఠిన ప్రయత్నాల తర్వాత చివరికి టీడీపీ అధినేత నారా చంద్రబాబుకు బెయిల్ మంజూరు అయింది. ఇది కూడా మధ్యంతర బెయిల్ కావడం పెద్ద ట్విస్ట్. నవంబర్ 28వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు బాబు మళ్ళీ జైలుకు చేరుకోవాలి. ఈ కండిషన్ ప్రకారమే బాబుకి వచ్చి జైలు నుంచి మాత్రమే బయటకు తీసుకొచ్చింది.

ఆయన హైదరాబాద్ నివాసంలో విశ్రాంతి తీసుకోవచ్చు. ఆయన కావాలనుకున్న ఆసుపత్రిలో కంటికి ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. కానీ, ఎట్టి పరిస్థితుల్లో ప్రజలను చైతన్యం చేసే విధంగా రాజకీయ సమావేశాలు పెట్టకూడదు.. పాల్గొనకూడదు. పార్టీ నేతలతో సమావేశం కూడా కాకూడదు. ఇదే ఇపుడు యూహాలకి కష్టంగా మారింది. బెయిల్ వస్తే చంద్రబాబు టీడీపీ నేతలతో కలిసి మీటింగులు పెట్టి పార్టీని బలోపేతం చేస్తూ మళ్లీ జనంలోకి తీసుకెళ్తారని ప్రతీ ఒక్కరు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సమయంలో బాబు దేనికోసం అయితే బెయిల్ కోరారో ఆ పనులు మాత్రమే చూసుకోవాలని కోర్టు ఖచ్చితంగా ఆదేశించింది.

chandrababunaidu-tdp-Babu gets bail or not?

Chandrababunaidu-TDP: కనుసన్నలలో జరిగేవి జరుగుతూనే ఉంటాయి..

చంద్రబాబు వెంట ఇద్దరు డీఎస్పీలు వెంటే ఉంటారు. అయినా ఆయన కనుసన్నలలో జరిగేవి జరుగుతూనే ఉంటాయని చెప్పుకుంటున్నారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరికి ఆయన సంకేతాలు ఇస్తుంటారట. పార్టీ నేతలకు అందాల్సిన సమాచారాన్ని ఇస్తూ పార్టీని నడిపించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ మీద నవంబర్ 10వ తేదీన హైకోర్టులో విచారణ ఉంది. అంతకన్నా ముందు సుప్రీం కోర్టు నవంబర్ 8న క్వాష్ పిటిషన్ మీద తీర్పును ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. క్వాష్ పిటిషన్ కొట్టేస్తే గనక బాబు గారు అనుకుంటున్న న్యాయం జరిగినట్లే. అన్యాయంగానే కేసు పెట్టారని బలంగా మాట్లాడవచ్చు. చూడాలి మరి రేపటి నుంచి బాబు వ్యాహాలు ఎలా ఉండబోతున్నాయో.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Tollywood: పవన్‌తో విడిపోయిన వెంటనే అన్నా కీలక నిర్ణయం..!

Tollywood: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితం మరోసారి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ, సోషల్ మీడియా వేదికగానూ హాట్…

4 days ago

AP POLITICS: ఏపీ లోకల్ ఎలక్షన్స్.. వైసీపీకి ప్లస్సా? మైనసా?

AP POLITICS: గత సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా కోలుకోలేదా? అంటే..…

4 days ago

TS POLITICS: రేవంత్ బర్త్‌డే: పట్టించుకోని కాంగ్రెస్ పెద్దలు

TS POLITICS: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఒక…

4 days ago

NATS: షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. మిషిగన్‌లో నాట్స్

NATS: అమెరికాలోని షార్లెట్‌ లో నిర్వహించిన ‘షార్లెట్ తెలుగు సంబరాలు 2026’ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారులు, యువత, పెద్దలు…

4 weeks ago

Sai Gangula: న్యూజెర్సీ తెలుగు సమాజానికి నాట్స్ కొత్త నాయకత్వం – చాప్టర్ లీడర్‌గా సాయి గంగుల నియామకం

Sai Gangula: న్యూజెర్సీలోని తెలుగు సమాజానికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) కొత్త నాయకత్వాన్ని ప్రకటించింది. నాట్స్ న్యూజెర్సీ…

4 weeks ago

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

2 months ago

This website uses cookies.