Wed. Jul 9th, 2025

    Tollywood Trending: టాలీవుడ్ క్రేజీ బ్యూటీస్ శ్రీలీల, సాయి పల్లవితో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాను నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా ఓ లేటెస్ట్ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాదు, ఇది డాన్స్ బేస్డ్ గా సాగే కథ అని సమాచారం. సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రేమమ్ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. అంతకముందే, ఢీ డాన్స్ షో ద్వారా సాయి పల్లవి మన తెలుగు ప్రేక్షకులకి పరిచయమే.

    ఫిదా, లవ్ స్టోరీ, విరాట పర్వం లాంటి సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సాధించింది. కథ, అందులో ఆమె పాత్ర చాలా నీట్‌గా ఉంటేనే సినిమాను ఒప్పుకుంటుంది సాయి పల్లవి. గ్లామర్ రోల్స్ చేయాలీ అంటే అలాంటి అవకాశాలేవీ నాకవసరం లేదనుకుంటుంది. అలాంటి పరిస్థితే వస్తే ఊరెళ్ళిపోయి డాక్టర్‌గా ప్రాక్టీస్ చేసుకుంటా.. అని పలు సందర్భాలలో చెప్పింది. అందుకే, సాయి పల్లవితో సినిమా చేయాలనుకుంటే మంచి కథతోనే మేకర్స్ అప్రోచ్ అవుతున్నారు.

    tollywood-trending-dil-raju-new-movie-with-sai-pallavi-sreeleela
    tollywood-trending-dil-raju-new-movie-with-sai-pallavi-sreeleela

    Tollywood Trending: లీలమ్మో సాంగ్ యూట్యూబ్ లో ఇప్పుడు దుమ్ము దులుపుతోంది.

    ఇక శ్రీలీల.. ఇప్పుడు తెలుగులో బిజీ హీరోయిన్. నిండా 22 ఏళ్ళు కూడా లేని ఈ కుర్రభామ ప్రస్తుతం తెలుగులో వరుస అవకాశాలు అందుకుంటూ బాక్సాఫీస్ వద్ద హాట్ టాపిక్‌గా మారింది. శ్రీలీల కూడా మాస్ ఆడియన్స్ ని తన డాన్స్ పర్ఫార్మెన్స్‌తో బాగా ఆకట్టుకుంటోంది. పంజా వైష్ణవ్ తేజ్ సరసన ఈ భామ నటించిన లేటెస్ట్ మూవీ ఆదికేశవ. ఈ సినిమా రిలీజ్‌కి రెడీ అవుతోంది. ప్రస్తుతం మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.

    tollywood-trending-dil-raju-new-movie-with-sai-pallavi-sreeleela
    tollywood-trending-dil-raju-new-movie-with-sai-pallavi-sreeleela

    ఇటీవల విడుదలైన లీలమ్మో సాంగ్ యూట్యూబ్ లో ఇప్పుడు దుమ్ము దులుపుతోంది. అయితే, ఇప్పుడు శ్రీలీల, సాయి పల్లవిలతో ఓ క్రేజీ ప్రాజెక్ట్ ని నిర్మించాలని టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారట. ఇద్దరికీ సరిపోయే కథ, అది కూడా పూర్తిగా డాన్స్ బేస్డ్ గా ఉండాలని దర్శక రచయితలకి సూచించినట్టుగా ఇప్పుడు టాలీవుడ్‌లో ఓ న్యూస్ వైరల్ అవుతోంది. దిల్ రాజు అనుకుంటే చేసేయడం పెద్ద పనేమీ కాదు. కాబట్టి త్వరలో దిల్ రాజు నిర్మాణంలో సాయి పల్లవి, శ్రీలీల కలిసి ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ చేయడం పక్కా అని చెప్పుకుంటున్నారు.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.