Tollywood : సాయి పల్లవి త్వరలో ఓ కొత్త సినిమా ద్వారా మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నాగ చైతన్యతో లవ్‌స్టోరీ, రానా దగ్గుబాటితో విరాట పర్వం సినిమాలు చేసింది. ఈ సినిమాలలో ఒకటి మంచి కమర్షియల్ హిట్ సాధించగా, మరో సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద చతికిల పడింది. దాంతో మళ్ళీ ఇప్పటివరకూ కొత్త సినిమాను ప్రకటించలేదు. సాధారణంగానే కథ నచ్చితే సైన్ చేసే సాయి పల్లవి..హంగు ఆర్భాటాలకి చాలా దూరంగా ఉంటుంది.
అయితే, కృతీశెట్టి, శ్రీలీల గ్లామర్ దెబ్బకి ఈ ఫిదా బ్యూటీ వెనకపడిందని ఈ మధ్య సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపించాయి. దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందించిన ఫిదా, లవ్‌స్టోరీ చిత్రాలలో నటించిన సాయి పల్లవి ముచ్చటగా మూడోసారి ధనుష్ హీరోగా తెరకెక్కించబోతున్న పాన్ ఇండియా సినిమాతో మళ్ళీ సందడి చేయనుందని చెప్పుకున్నారు. కానీ, ఇప్పటి వరకూ ఈ ప్రాజెక్ట్‌లో సాయి పల్లవి నటించనుందనే అధికారిక ప్రకటన రాలేదు.

Tollywood : సాయి పల్లవి పాత్ర కూడా ఇలాగే ఉండబోతుందట.
కాగా, తాజా సమాచారం మేరకు అక్కినేని నాగ చైతన్య, టాలెంటెడ్ డైరెక్టర్ చందు మొండేటి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఓ కొత్త సినిమా (NC 23)లో నటించబోతుందట. ఇదే నిజమైతే నాగ చైతన్యతో అమ్మడు రెండవసారి రొమాన్స్ చేయడానికి సిద్ధమవుతున్నట్టు అనుకోవాలి. ఇప్పటికే చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాలో నాగ చైతన్య జాలరి పాత్రలో కనిపించబోతున్నాడు. సాయి పల్లవి పాత్ర కూడా ఇలాగే ఉండబోతుందట. మత్స్యకారుల జీవిత కథ ఆధారంగా చందు మొండేటి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
ఇలాంటి నేచురల్ క్యారెక్టర్ అయితే సాయి పల్లవి తప్ప ఇంకెవరూ చేయలేరు. ఫిదా సినిమాలో కూడా ఇలాంటి నేచురల్ క్యారెక్టరే చేసి ఫిదా బ్యూటీగా మారింది. ఇక ఈ సినిమా నాగ చైతన్య కెరీర్‌లో 23 వది. చందు మొండేటి గత చిత్రం కార్తికేయ 2 పాన్ ఇండియా లెవల్‌లో భారీ సక్సెస్ సాధించింది. ఇప్పుడు నాగ చైతన్య-చందు మొండేటి-సాయి పల్లవిల కాంబో అనగానే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి సంచలన విజయం సాధిస్తుందో.