Gujarat Temple: సాధారణంగా మనం ఎన్నో ఆలయాలను దర్శిస్తూ ఉంటాము అక్కడ స్వామివారికి వివిధ రకాల ఆహార పదార్థాలను ప్రసాదాలను పంచామృతాలను నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటాము అయితే ఈ ఆలయంలో మాత్రం నైవేద్యంగా వాటర్ బాటిల్లను ఉంచడం ఆనవాయితీగా వస్తుంది ఇలా వాటర్ బాటిల్లను నైవేద్యంగా ఉంచే ఆలయం ఎక్కడ ఉంది ఇలా వాటర్ బాటిల్ ని ఎందుకు నైవేద్యంగా పెడతారు ఇలా పెట్టడం వెనుక ఉన్నటువంటి కారణం ఏంటి అనే విషయానికి వస్తే..
ఈ ఆలయం పటాన్ .. మోధేరా మధ్య ఉంది. ఈ ఆలయ నిర్మాణం వెనుక ఓ ప్రమాదం జరిగిందట.. ఈ స్థలంలో ఒక ప్రమాదం జరగడంతో ఆరుగురు ప్రయాణికులు మరణించారు. అందులో ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. వారు మరణించే ముందు దాహం దాహం అంటూ అడిగినప్పటికీ సమీపంలో ఎక్కడ నీళ్లు లేకపోవడంతో ఆ చిన్నారులు ఇద్దరు మరణించారు అప్పటి నుంచి ఈ ప్రాంతంలో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయట ఇది గమనించినటువంటి స్థానికులు ఆ ఇద్దరు చిన్నారులను దేవతలుగా భావించి చిన్న ఆలయం నిర్మించారు.
ఇక చిన్నారులు ఇద్దరు కూడా దాహం అంటూ మరణించడంతో అక్కడ ఉన్నటువంటి చిన్నారులకు సమీప బావులలోని నీటిని నైవేద్యంగా సమర్పిస్తూ వచ్చారు అప్పటినుంచి ఈ ఆనవాయితీ అలాగే కొనసాగుతూ వస్తుంది. ఈ క్రమంలోనే ఇక్కడ వాటర్ బాటిల్ ద్వారా నీటిని నైవేద్యంగా సమర్పించడంతో ప్రమాదాలు కూడా పూర్తిగా తగ్గిపోయాయి అలాగే ఈ నైవేద్యంగా సమర్పించిన నీళ్లను ప్రసాదంగా తీసుకోవటం వల్ల ఎన్నో రకాల రోగాలు కూడా నయమవుతున్నాయని తెలుస్తోంది. ఇలా ఆలయంలో చిన్నారులనే దేవతలుగా భావించి వాటర్ బాటిల్లను నైవేద్యంగా పెడుతున్నటువంటి ఆచారం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.