Mon. Jul 14th, 2025

    Tollywood Heroines: టాలీవుడ్‌లో ఒక దర్శకుడిగా 100 కోట్లను సంపాదించిన ఘనత దాన్ని పోగొట్టుకున్న చేతకాని తనం గురించి మాట్లాడుకోవాలంటే అది ఒక్క పూరి జగన్నాద్ విషయంలోనే. అమ్మానాన్నల సపోర్ట్ తో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి దర్శకుడిగా పూరి మొదటి సినిమాతోనే సంచలనం సృష్ఠించారు. పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ అవకాశం ఇవ్వడం అంటే కథ నరేషన్ ఎంత గొప్పగా ఉంటుందో అర్థం అవుతుంది.

    పూరి జగన్నాద్ సినిమాలో హీరో మహా మాస్ గా ఉంటాడు. రాటుతేలిన సింహంలా గర్జిస్తాడు. క్లాస్ హీరోకి కూడా మాస్ ఇమేజ్ వచ్చేస్తుందీ అంటే అది ఒక్క పూరి జగన్నాద్ వల్లే. ఇక హీరోయిన్స్ విషయంలో కూడా పూరి ఎంతో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటారు. కథలో ఖచ్చితంగా హీరోయిన్ పాత్రకి ప్రాధాన్యత ఉంటుంది. ఇది అందరి దర్శకుల వల్లా కాదని చెప్పొచ్చు. అయితే, పూరి జగన్నాద్ పరిచయం చేయగా ఇప్పటికీ స్టార్ హీరోయిన్ గా మంచి క్రేజ్ ఉన్న అనుష్క శెట్టి ఉన్నట్టే అసలు అడ్రస్ లేకుండా పోయిన హీరోయిన్స్ కూడా ఉన్నారు.

    tollywood-heroines-who-lost-chance-again-due-to-puri-jagannadh-movies
    tollywood-heroines-who-lost-chance-again-due-to-puri-jagannadh-movies

    ఎందుకనో పూరి ఛాన్స్ ఇవ్వగానే గాల్లో మేడలు కట్టేసుకున్న హీరోయిన్స్ మళ్ళీ టాలీవుడ్‌లో కనిపించలేదు. వారెవరో ఒకసారి చూద్దాం.

    బద్రి: ఈ సినిమాతో తెలుగు తెరకి పరిచయమయ్యారు రేణు దేశాయ్, అమీషా పటేల్. ఇద్దరికీ మంచి సక్సెస్ వచ్చింది. కానీ, ఇప్పుడు ఇద్దరూ సినిమాలకి దూరంగా ఉన్నారు. రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగులో పవన్ కళ్యాణ్ తోనే బద్రి, జానీ సినిమాలు చేశారు. అంతే. మళ్ళీ ఇంతకాలానికి మాస్ మహారాజ రవితేజ నటించిన టైగర్ నాగేశ్వర రావు సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఇలాగే కంటిన్యూ అవుతారా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు. అమీషా పటేల్ తెలుగులో చేసింది చాలా తక్కువ సినిమాలే. బాలీవుడ్ లో మాత్రం బాగానే వెలిగింది.

    tollywood-heroines-who-lost-chance-again-due-to-puri-jagannadh-movies
    tollywood-heroines-who-lost-chance-again-due-to-puri-jagannadh-movies

    రక్షిత: ఇడియట్ సినిమాతో పరిచయమైన రక్షిత మొదట్లో మంచి సక్సెస్‌లు అందుకున్నా ఆ తర్వాత తెరమరుగైపోయింది. ఎన్.టి.ఆర్, నాగార్జున, చిరంజీవి లాంటి స్టార్స్ తో నటించినప్పటికీ రక్షిత ఇక్కడ నిలబడలేకపోయింది.

    tollywood-heroines-who-lost-chance-again-due-to-puri-jagannadh-movies
    tollywood-heroines-who-lost-chance-again-due-to-puri-jagannadh-movies

    ఆసిన్: అమ్మా నాన్న ఒక తమిళ అమ్మాయి సినిమాతో పూరి టాలీవుడ్ కి పరిచయం చేశారు. ఈ సినిమా తర్వాత ఆసిన్ తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకుంది. పూరి ఇచ్చిన లైఫ్ ఆసిన్ కి బాగా ఉపయోగపడింది. భారీగా రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి చేరుకుంది. హిందీ, తమిళంలో ఆసిన్ బాగానే పాపులారిటీ తెచ్చుకుంది.

    కంగనా రనౌత్: పొకిరి సినిమాతో పరిచయం చేయాలనుకున్న పూరి కుదరక ప్రభాస్ నటించిన ఏక్ నిరంజన్ ద్వారా తీసుకొచ్చారు. తెలుగులో కంగనా నటించిన ఒకే ఒక్క స్ట్రైట్ సినిమా ఇది. అంతే ఏక్ నిరంజన్ ఫ్లాపవడంతో మళ్ళీ అడ్రస్ లేదు.

    అనుష్క శెట్టి-ఆయేషా టాకియా: నాగార్జున హీరోగా పూరి జగన్నాద్ తెరకెక్కించిన సూపర్ సినిమాతో అనుష్క శెట్టి, ఆయేషా టాకియా తెలుగు ఇండస్ట్రీకి పరిచ్యం అయ్యారు. ఆయేషా కి మంచి హిట్ వచ్చినా మళ్ళీ అడ్రస్ లేదు. అనుష్క మాత్రం ఇంకా మంచి కెరీర్ ని లీడ్ చేస్తుంది. ఇటీవల మిస్ శెట్టి మిసెస్ పోలిశెట్టి సినిమాతో వచ్చి హిట్ అందుకుంది.

    tollywood-heroines-who-lost-chance-again-due-to-puri-jagannadh-movies
    tollywood-heroines-who-lost-chance-again-due-to-puri-jagannadh-movies

    దిశ పటాని: లోఫర్ సినిమాతో వచ్చిన ఈ బ్యూటీ మళ్ళీ కంటికి కనిపించలేదు. వీరే కాదు, ఇజం సినిమాతో పరిచయమైన అదితి ఆర్య, నేనింతే సినిమాతో పరిచయమైన శియా గౌతం, చిరుత సినిమాతో పరిచయమైన నేహ శర్మ లాంటి వారు మళ్ళీ కనిపించలేదు. వీళ్ళు పూరి సినిమాతో తమ స్టార్ తిరుగుతుందని భావించారు.

    tollywood-heroines-who-lost-chance-again-due-to-puri-jagannadh-movies
    tollywood-heroines-who-lost-chance-again-due-to-puri-jagannadh-movies

    ఇక హన్షిక మొత్వాని, ప్రియమణి, ఇలియానా, త్రిష, అమలా పాల్, కేథరీన్, కాజల్ అగర్వాల్, నభా నటేష్, నిధి అగర్వాల్ లాంటి వారు పూరి సినిమాలతో మంచి హిట్స్ అందుకున్నారు. కానీ, వీళ్ళలో కొందరు ఇప్పుడు అవకాశాల కోసం ఆవురావురంటున్నారు.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.