Tollywood Exclusive: గుంటూరు కారం స్టోరీ లీక్..మరోసారి పొలిటీషియన్‌గా మహేశ్..? అవును ప్రస్తుతం ఈ లేటెస్ట్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దూకుడు తరహాలో మహేశ్ బాబు, ప్రకాశ్ రాజ్ గుంటూరు కారం సినిమాలో తండ్రీకొడుకులుగా కనిపించబోతున్నారు. దూకుడు, భరత్ అనే నేను సినిమాల మాదిరిగా ఈ సినిమా కూడా పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో కథ నడుస్తుందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం.
త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేశ్ బాబు కాంబినేషన్‌లో 17 ఏళ్ళ క్రితం అతడు, ఆ తర్వాత ఖలేజా చిత్రాలొచ్చాయి. ఇప్పుడు ఇదే కాంబినేషన్‌లో హ్యాట్రిక్ మూవీ రూపొందుతోంది. 2024 సంక్రాంతి పండుగ సందర్భంగా అత్యంత భారీ స్థాయిలో గుంటూరు కారం విడుదలవబోతుంది. అయితే, గుంటూరు కారం సినిమాలో పూర్తిగా రాజకీయాల నేపథ్యంలోనే ఉండబోతుందని సమాచారం.

Tollywood Exclusive: మహేశ్ బాబు చేస్తున్న క్యారెక్టర్ పేరు వెంకటరమణ రెడ్డి
గుంటూరు కారం కథ: ఈ సినిమాలో మహేశ్ బాబు చేస్తున్న క్యారెక్టర్ పేరు వెంకటరమణ రెడ్డి. మహేశ్ తండ్రి వైర వెంకట స్వామి క్యారెక్టర్‌లో (ప్రకాశ్ రాజ్) నటిస్తున్నారు. జనదళం అనే పార్టీలో ఆయన పార్టీ ప్రధాన కార్యదర్శి. రాజకీయాలు అంటే ఇష్టం ఉండని వెంకట రమణ రెడ్డి (మహేశ్ బాబు) తన తండ్రి 80 పుట్టిన రోజు తర్వాత ఊహించని విధంగా రాజకీయాల్లోకి వస్తాడట. రాజకీయాలలోకి అడుగు పెట్టిన తర్వాత శత్రువులను, రాజకీయ శత్రువులను హీరో ఎలా ఎదుర్కున్నాడు అనేది మిగితా కథ అని తెలుస్తోంది.
ఇదే కథా నేపథ్యం అయితే, ఏపీ రాజకీయాల వాడి వేడి కారణంగా గుంటూరు కారం ఖచ్చితంగా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడం ఖాయం అని చెప్పవచ్చు. గతంలో త్రివిక్రమ్ మహేశ్ బాబుతో రెండు సినిమాలు తీసి ఫ్లాపులిచ్చారు. కానీ, ఈ సారి భారీ హిట్ ఇవ్వాలనే కసితో ఈ గుంటూరు కారం చిత్రాన్ని రూపొందిస్తున్నారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ సినిమాకి ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.