Tollywood Cinema: 2025 సంక్రాంతికి మూడు భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మూడు చిత్రాలలో ఏదీ హిట్టు ఏదీ యావరేజ్ ఏదీ ఫ్లాప్ అనే సందిగ్ధం చాలామందిలో ఉంది. తెలుగు సినిమాకి సంక్రాంతి, సమ్మర్, దసరా, క్రిస్మస్ సీజన్స్ ఎంతో కీలకం. అందుకే, ఈ సీజన్స్ ని టార్గెట్ చేసుకొని మన తెలుగు ఇండస్ట్రీలో చిన్న సినిమా నుంచి పెద్ద స్టార్స్ నటించిన సినిమాల వరకూ బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతుంటాయి.
ఈ సంక్రాంతికి కూడా ‘గేమ్ చేంజర్’, ‘డాకూ మహారాజ్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలొచ్చాయి. ‘గేమ్ చేంజర్’ పాన్ ఇండియా సినిమాగా రిలీజై మొదట డివైడ్ టాక్ తెచ్చుకుంది. ఇంకా చెప్పాలంటే ఫ్లాప్ అని చాలా చోట్ల నుంచి రివ్యూ వచ్చింది. దాంతో తర్వాత రిలీజైన బాలయ్య ‘డాకూ మహారాజ్’ మీద అందరూ ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా కథ రొటీన్ అయినప్పటికీ బాలయ్య ప్రజెన్స్, థమన్ మ్యూజిక్, ఎలివేషన్స్ అందరికీ బాగా నచ్చి సినిమా హిట్ అని చెప్పారు.

Tollywood Cinema: 100 సక్సెస్ ఈ సంక్రాంతికి వచ్చినట్టు ఎలా అవుతుంది..?
ఆ తర్వాత కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన వెంకీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ బ్లాక్ బస్టర్ అని ఫ్యామిలీ ఆడియన్స్ తేల్చేశారు. వాస్తవానికి ఈ సినిమా కూడా పస లేని కథతో దర్శకుడు అనిల్ రావిపూడి మెప్పించే ప్రయత్నం చేశాడు తప్ప సినిమాలో ఏమీ లేదనే మాట్లాడుకున్నారు. కట్ చేస్తే సంక్రాంతి విన్నర్ వెంకటేశ్ అంటున్నారు.
సాధారణంగా మన తెలుగు సినిమాలు సంక్రాంతికి వచ్చి 100 శాతం సక్సెస్ కావడం చాలా అరుదుగా జరిగే విషయం. ఎప్పుడో 2017 లో మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇస్తూ చేసిన ఖైదీ నంబర్ 150, బాలయ్య గౌతమీపుత్ర శాతకర్ణి, శతమానం భవతి సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ళు రాబట్టి 100 శాతం సక్సెస్ అందుకున్నాయి. మళ్ళీ ఇన్నేళ్ళకి అది రిపీట్ అయిందంటున్నారు. కానీ, ‘గేమ్ చేంజర్’ విషయంలో మాత్రం ఇది నమ్మబుద్ది కావడం లేదు. ఆ రకంగా చూసుకుంటే 100 సక్సెస్ ఈ సంక్రాంతికి వచ్చినట్టు ఎలా అవుతుంది..?