Health care: సాధారణంగా మనం తీసుకునే ఆహార పదార్థాలలో ఎన్నో పోషక విలువలు ఉంటాయి అయితే మరింత పోషక విలువలు మన శరీరానికి అందాలు అంటే చాలామంది డ్రై ఫ్రూట్స్ తమ ఆహారంలో భాగంగా చేర్చుకొని ఉంటారు. ఇలా డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల మన శరీరానికి అదనంగా పోషకాలు అందుతాయనే విషయం మనకు తెలిసిందే. ముఖ్యంగా బాదం పప్పులో అధికంగా పోషక విలువలు దాగి ఉంటాయని తెలుసు అందుకే ప్రతిరోజు ఉదయం నానబెట్టిన నాలుగు బాదం పప్పులు తినటం వల్ల మన శరీరానికి పుష్కలంగా పోషక విలువలు లభిస్తాయి.
ఇకపోతే చాలామంది నానబెట్టి వాటిని తింటూ ఉంటారు మరి కొందరు నానబెట్టకుండా అలాగే బాదం పప్పును తింటూ ఉంటాము. అయితే బాదంపప్పు నానబెట్టకుండా తినడం వల్ల వచ్చే లాభాల కంటే నష్టాలే అధికంగా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బాదం పప్పులో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుందనే విషయం తెలిసిందే. ఇది జీర్ణక్రియకు మేలు చేస్తుంది. అయితే బాదంను నానబెట్టకుండా తీసుకుంటే అది జీర్ణ వ్యవస్థలో ఇబ్బందులను కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఇలా నానబెట్టకుండా బాదంపప్పు తినడం వల్ల గ్యాస్ మలబద్ధకం వంటి సమస్యలు వెంటాడుతాయి. బాదంలో ఉండే ఫైటిక్ యాసిడ్ వంటి కొన్ని పోషకాలను శరీరం సులభంగా గ్రహించవు. అదే బాదం పప్పును నానబెట్టి తీసుకోవడం వల్ల ఫైటిక్ యాసిడ్ విచ్చిన్నమవుతుంది. ఈ కారణంగా శరీరం బాగా గ్రహించేలా చేస్తుంది. ఇక బాధ పప్పు నానబెట్టకుండా తినడం వల్ల దంత సమస్యలు కూడా వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇక కొందరిలో అలర్జీలు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.