Thati Munjalu: తాటి ముంజలు పేరు వినగానే ఎవరికైనా తినాలనిపిస్తుంది.వేసవి సీజన్లో మాత్రమే లభించే తాటి ముంజలు అంటే ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు.వీటిని ఇంగ్లీషులో ఐస్ యాపిల్స్ అని కూడా అంటారు. తాటి ముంజలు అద్భుతమైన రుచితో పాటు మన శరీరానికి అవసరమైన అన్ని పోషక విలువలు సమృద్ధిగా లభిస్తాయి. కేవలం వేసవికాలంలో మాత్రమే దొరికే ఈ తాటి ముంచలను తినటం వల్ల మనకు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందుతాయని చెప్పాలి. ముఖ్యంగా వేసవి తాపం వల్ల వచ్చే డీ హైడ్రేషన్, అలసట, నీరసం వంటి లక్షణాలను తొలగించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి.
ఈ వేసవి కాలంలో ప్రతిరోజు తాటి ముంజలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇప్పుడు తెలుసుకుందాం.తాటి ముంజల్లో విటమిన్స్ తో పాటు ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, జింక్, పొటాషియం, వంటి ఎన్నో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. కావున మనలో రోగ నిరోధక శక్తిని పెంపొందేలా చేస్తుంది.ఒక్క తాటి ముంజను మనం తినటం వల్ల ఆరు అరటిపండ్లలో లభించే పొటాషియం ఇందులో మనకు లభిస్తుంది. కావున రక్తప్రసరణ లోపాలను సవరించి హై బీపీ ,లో బిపి సమస్యలను నివారిస్తుంది.
Thati Munjalu:
ముఖ్యంగా తాటి ముంజుల మధ్యలో స్వచ్ఛమైన, రుచికరమైన నీరు ఉంటుంది.ఆ నీరు శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. ఎండల్లో దాహార్తిని తీరుస్తాయి. వడదెబ్బ తగిలినవాళ్లకు ముంజులను జ్యూస్‌గా చేసి తాగిస్తే వెంటనే ఉపశమనం లభిస్తుంది. లేత తాటిముంజెలు పైన ఉన్న తొక్కను తొలగించకుండా తినేయండి అందులో ఉన్న ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు జీర్ణ సమస్యలను తొలగించడంలో దివ్య ఔషధంలా పనిచేస్తుంది.ఇలా వేసవిలో లభించే తాటి ముంజలను తినటం వల్ల ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలను మనం పొందవచ్చు.