Tamannaah Bhatia : హీరోయిన్ తమన్నా గురించి ఇంట్రడక్షన్ అవసరం లేదు. 2005 నుంచి తన సినీ కెరీర్ స్టార్డ్ చేసిన ఈ బ్యూటీ ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా విజయవంతంగా కొనసాగుతోంది. టాలీవుడ్ లో దాదాపు అందరు స్టార్ హీరోలతో జోడీ కట్టి దుమ్ముదులిపింది మిల్కీ బ్యూటీ. ఇన్నేళ్లలో ఇండస్ట్రీలో ఉన్నా తమన్నా గురించి మొన్నటి వరకు ఏ రూమర్ వినిపించలేదు.
అలాంటిది గత కొంత కాలం క్రితం తమన్నా లవ్ మేటర్ బయటికి వచ్చింది. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో తమన్నా రిలేషన్ లో ఉన్నట్లు ఇండస్ట్రీ కోడై కూస్తోంది. దీంతో మిల్కీ బ్యూటీ తమన్నా, బాలీవుడ్ నటుడు విజయ్ వర్మల లవ్ స్టోరీ అందరికీ తెలిసిపోయింది.ఈ జంట ప్రేమకథ లీక్ కావడంతో ఎంచక్కా బాలీవుడ్ లో, ముంబై వీధుల్లో చెక్కర్లు కొడుతూ కెమెరాలకు ఫోజులు ఇస్తున్నారు. వీరిద్దరు ఎప్పుడు కలిసి కనిపించినా ఆ పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతూనే ఉంటాయి. ఎందుకంటే బీ టౌన్ లో వీరు మోస్ట్ వాంటెడ్ కపుల్ మరి. వీరిద్దరూ ప్రస్తుతం తమ రిలేషన్లో ఎంతో హ్యాపీగా ఉన్నారు. కెరీర్ లోనూ మంచి జోష్ లో ముందుకెళ్తున్నారు.
ఈ సంవత్సరం న్యూయర్ సందర్భంగా తమన్నా-విజయ్ వర్మ కిస్ చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో వీరిద్దరి ప్రేమ వ్యవహారం బయటపడింది.దీంతో ఓపెన్గానే చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. తమన్నా, విజయ్ ఇద్దరూ కలిసి ‘లస్ట్ స్టోరీస్ 2’ సిరీస్ లో నటించారు. ఈ సిరీస్ లో హద్దులుదాటి మరీ ముద్దులు పెట్టుకుంటూ, రొమాన్స్ తో ఓ రేంజ్ లో రెచ్చిపోయారు. దీంతో ఆటోమేటిక్ గా వీరిద్దరి పెళ్లి టాపిక్ ఇప్పుడు ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. అయితే ఇప్పట్లో మ్యారేజ్ ఉండకపోవచ్చు అన్నట్లు తమన్నా ఓ సందర్భంలో తెలిపింది. దీంతో వీరి వివాహానికి ఇంకా టైం ఉందని అందరూ భావించారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు మారిపోయినట్లు తెలుస్తోంది.
తమన్నా పేరెంట్స్ పెళ్లి విషయంలో ఆమెను ఒత్తిడి చేస్తున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. బ్యూటీ వయసు కూడా పెరిగిపోతుండటంతో వారు తొందరగా పెళ్లి చేస్తే ఓ పనైపోతుందని ఫీల్ అవుతున్నారంట. దీంతో మిల్కీబ్యూటీ కూడా పెళ్లికి సరేనని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట.
అయితే ప్రస్తుతం తమన్నా, విజయ్ లు ఇద్దరి చేతిలో పలు సినిమాలు ఉన్నాయి. ఓ వైపు ఆ ప్రాజెక్టులను కంప్లీట్ చేస్తూనే , వచ్చే ఏడాది ప్రారంభంలో పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నారట. దీనిని బట్టి చూస్తూ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో తమన్నా పెళ్లి ఉంటుందన్న టాక్ బీ టౌన్ లో వినిపిస్తోంది.