Sreeleela: యంగ్ బ్యూటీ శ్రీలీల చేతిలో మరే హీరోయిన్ కి లేనన్ని అవకాశాలున్నాయి. ‘పెళ్లి సందD’ చూసిన తర్వాత అంతగా క్లిక్ అవదనే కామెంట్స్ వినిపించాయి. కానీ, రవితేజ సరసన చేసిన ‘ధమాకా’ హిట్ తర్వాత అనుకోకుండా శ్రీలీలకి వరుసగా అవకాశాలు వచ్చి పడ్డాయి. రవితేజ లాంటి సీనియర్ హీరోతో సినిమా చేస్తుందంటే ఇక శ్రీలీల సర్దుకోవాల్సిందే..అంటూ కామెంట్స్ వినిపించాయి.
కానీ, అదే సినిమాతో ఎగసిపడుతుంది. ‘స్కంద’, ‘భగవంత్ కేసరి’, ‘ఎక్స్ట్రా’, ‘ఆదికేశవ’..ఇలా వరుసగా శ్రీలీల నటించిన సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో భగవంత్ ఒక్కటే సూపర్ హిట్. అది కూడా బాలయ్య ఖాతాలోకి వెళ్ళిపోయింది. ఇన్ని ఫ్లాపులొస్తున్న హీరోయిన్ ని సాధారణంగా అయితే, మన టాలీవుడ్ మేకర్స్ ఎప్పుడో మెల్లగా పక్కన పెట్టేవారు. కానీ, ఇప్పుడున్న హీరోయిన్స్ లో రష్మిక మందన్న పెద్ద అందగత్తే కాకపోయినా సక్సెస్ ల వల్ల నెట్టుకొస్తుంది.
Sreeleela: డాన్స్ పరంగా బాగా మెస్మరైజ్ చేస్తుంది.
కృతీశెట్టి ఫ్లాపుల్లో కూరుకుపోయి ఆశించిన అవకాశాలు దక్కించుకోవడం లేదు. మిగతా హీరోయిన్స్ పరిస్థితీ ఏదో అంతంత మాత్రమే. పైగా వీరిలో డాన్స్ పరంగా చూస్తే మాస్ ఆడియన్స్ అంతగా ఆకట్టుకుంటున్నవారు లేరు. సాయి పల్లవి, తమన్నా తప్ప ఊరమాస్ డాన్స్ తో అలరిస్తున్నవారు లేరనే చెప్పాలి. అదే వరుస ఫ్లాపులొస్తున్నా శ్రీలీలకి ప్లస్ అవుతోంది. తను నటిస్తున్న సినిమాలలో డాన్స్ పరంగా బాగా మెస్మరైజ్ చేస్తుంది.
మొదటి సినిమా ‘పెళ్లి సందD’ ఆ తర్వాత ‘ధమాకా’, ‘భగవంత్ కేసరి’, ‘ఆదికేశవ’ సినిమాలలో సాంగ్స్ కొన్ని అదిరిపోయాయి. ఇప్పుడు సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన ‘గుంటూరు కారం’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి ‘కుర్చీ మతడతపెట్టి’ అనే సాంగ్ ప్రోమో రిలీజ్ అయింది. ఈ సాంగ్ లో శ్రీలీల స్టెప్స్ చూస్తే కుర్రాళ్ళు ఊగిపోతున్నారు. మహేశ్, శ్రీలీల ఈ సాంగ్ కి వేసిన స్టెప్పులు ఓ రేంజ్ లో ఉండబోతున్నాయని ప్రోమో సాంగ్ చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడందరూ ఈ సాంగ్ ఫుల్ వీడియో ఎప్పుడు రిలీజ్ అవుతుందో అని ఎదురుచూస్తున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా ‘కుర్చీ మడతపెట్టీ’ సాంగ్ రిలీజ్ కానుంది. కాగా, 2024 సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 న భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ‘గుంటూరు కారం’.