SreeLeela: ‘ఎక్స్ ట్రా ఆర్డినరీ మేన్’. యూత్ స్టార్ నితిన్ నుంచి రాబోతున్న లేటెస్ట్ మూవీ. ఈ నెల 8వ తేదీన ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. గతకొంతకాలంగా నితిన్ కి సక్సెస్ దక్కడం లేదు. ఈసారి ఎలాగైనా భారీ హిట్ కొట్టాలని కసితో ఉన్నాడు. ఇటీవల ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ అయింది. పెద్దగా ఆకట్టుకోలేదు. కామెడీ వరకూ ఓకే గానీ, కంటెంట్ చూస్తే పెద్దగా ఆకట్టుకునేలా అనిపించడం లేదు.
ఈ సినిమా మీద ఆశలు పెట్టుకున్న నితిన్ మాత్రం చాలా కాన్‌ఫిడెంట్ గా కనిపిస్తున్నాడు. కానీ, హీరోయిన్‌గా నటించిన శ్రీలీల లో మాత్రం ఆ కాన్‌ఫిడెన్స్ కనిపించడం లేదు. ఇటీవల ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఆ ఈవెంట్ లో తెచ్చుకున్న ఉత్సాహంతో నితిన్ కనిపించినట్టు అనిపించింది. కానీ, శ్రీలీలలో అది కనిపించలేదంటున్నారు.
SreeLeela: ‘ఎక్స్ట్రా’ ఫలితం తేడా కొడితే ..?
బహుషా ఇప్పటికే ఈ సినిమా రిజల్ట్ ఏంటో అర్థం అయిపోయిందని అందుకే, శ్రీలీల అలా సైలెంట్‌గా ఉండిపోయిందని చెప్పుకుంటున్నారు. ఇప్పటి వరకూ ఈ కుర్ర బ్యూటీ ఖాతాలో ‘ధమాకా’ తప్ప ఇంకో హిట్ చేరింది లేదు. ప్రతీ సినిమాపై ఆశలు అంచనాలు పెట్టుకోవడం, ఫైనల్ రిజల్ట్ చూసి చల్లబడిపోవడమే శ్రీలీల వంతు అవుతోంది.
ఒకవేళ నితిన్ తో చేసిన ‘ఎక్స్ట్రా’ ఫలితం తేడా కొడితే తరువాత ఆశలన్నీ ‘గుంటూరు కారం’ మీద పెట్టుకోవాల్సిందే. ఒకవేళ గురూజీ గనక మహేశ్ మీదే కథ రాసుకుంటే శ్రీలీలకి అది మైనస్ అవుతుంది. ఇక అప్పుడు పెట్టుకోవాల్సిన నమ్మకాలు, ఆశలు ఒక్క పవన్ కళ్యాణ్ తో చేస్తున్న ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ సినిమా మీదే. ఏదేమైనా రానున్న రోజుల్లో శ్రీలీల కెరీర్ డేంజర్ జోన్‌లో పడటం ఖాయమనిపిస్తోంది.