Tue. Nov 18th, 2025

    Pushpa-Jagadeesh: పుష్ప మూవీలో నటించి బాగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు జగదీష్ ప్రతాప్ భండారిని తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారట. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చి పాన్ ఇండియా రేంజ్ లో హిట్ సాధించిన సినిమా పుష్ప. ఈ సినిమా తెలుగుతో పాటు మిగతా సౌత్ భాషలలో అలాగే, బాలీవుడ్ లో పెద్ద కమర్షియల్ సక్సెస్ ని అందుకుంది. అల్లు అర్జున్ ఈ సినిమాలో కుడి భుజంగా భావించే స్నేహితుడి పాత్రలో నటించిన కేశవ (అసలు పేరు జగదీష్ ప్రతాప్ భండారి) తాజాగా ఓ వివాదంలో ఇఉక్కుకున్నాడు.

    అతని మీద హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదయింది. ఈ నేపథ్యంలో పోలీసులు జగదీష్ ని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. దీనికి అసలు అసలు కారణం ఏమిటంటే ఓ జూనియర్ ఆర్టిస్టు (అమ్మాయి) వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉన్నప్పుడు ఫోటోలు తీశాడట. అంతేకాదు, వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని చెప్పి బ్లాక్మెయిల్ చేసినట్టుగా తెలుస్తోంది.

    pushpa-jagadeesh-Actor Pushpa arrested in case of harassment of young woman..!
    pushpa-jagadeesh-Actor Pushpa arrested in case of harassment of young woman..!

    Pushpa-Jagadeesh: అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాతో మంచి క్రేజ్

    జగదీష్ ప్రతాప్ వేధింపులతో పంజాగుట్ట పరిధిలో నివసిస్తున్న ఆమె నవంబర్ 29న ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు విచారణ జరిపగా..ఈ మహిళ ఆత్మహత్యకు కారణం జగదీష్ అని తేలిందట. నవంబర్ 27న ఓ వ్యక్తితో ఉన్న సమయంలో ఆమెకు తెలియకుండా జగదీష్ ఫోటోలు తీసి వాటిని చూపించి బెదిరించాడట. ఇది భరించలేక మనస్థాపానికి గురై ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది.

    ఇన్నిరోజుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న జగదీష్ ను ఈనెల 6వ తేదీన పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు. ఇంకో షాకింగ్ విషయం ఏమిటంటే ఇటీవల ఆంతహత్యకి పాల్పడిన మహిళతో ఇంతకముందే జగదీష్ కి పరిచయం ఉందని పోలీసులు వెల్లడించడం. ఇది తెలిసి కొందరు ఇలాంటి వాడిని ఊరికే వదలకూడదని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, జగదీష్ సినిమాలలోకి రాకముందు షార్ట్ ఫిలిమ్స్ చేసి గుర్తింపు తెచ్చుకున్నాడు. దాంతో 2019లో వచ్చిన మల్లేశం సినిమాలో అవకాశం వచ్చి తెలుగు తెరకి పరిచయం అయ్యాడు. జార్జ్ రెడ్డి, పలాస 1978 సినిమాలలో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాతో మంచి క్రేజ్ వచ్చింది.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.