Sreeleela: సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రావాలంటే చాలా అదృష్టం ఉండాలి. అందం, అభినయం ఉంటే సరిపోదు. ఇక్కడ హీరోయిన్‌గా నిలబడాలంటే ఇండస్ట్రీలో ప్రముఖుల అండదండలు ఉండాలి. లక్ కలిసి రావాలి. అవకాశల కోసం లక్ తో పాటు ఫ్లాపుల్లో ఉన్నా ఆదుకునే దర్శకనిర్మాతలో లేక హీరోనో ఖచ్చితంగా వెనకాల ఉండాలి. అలా, ఉన్న హీరోయిన్ శ్రీలీల. ఈ బ్యూటీ కెరీర్ లో హిట్స్ చిట్టా చాలా తక్కువ. ఇంకా చెప్పాలంటే వేళ్ళ మీద లెక్కపెట్టే హిట్ సినిమాలు మాత్రమే ఉన్నాయి.
కొన్ని సినిమాలు శ్రీలీల నటించిందంటే కూడా గుర్తు లేనివి ఉన్నాయి. అయినా, ఈ బ్యూటీ సౌత్ లో మరీ ముఖ్యంగా టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. అలాగే, తమిళంలో పరాశక్తి అనే సినిమా చేస్తోంది. హిందీలో ఇప్పటికే రెండు సినిమాలు చేస్తున్న శ్రీలీల త్వరలో కొత్త ప్రాజెక్ట్ కి సంబంధించిన అప్‌డేట్ ని ఇవ్వబోతోంది. రీసెంట్ గా ఈ ప్రాజెక్ట్ కి నుంచి లుక్ రివీల్ చేసి త్వరలో క్రేజీ అనౌన్స్‌మెంట్ రానుందని పోస్టర్ ని వదిలారు. ఇందులో శ్రీలీల ఏజెంట్ మిర్చి గా కనిపించబోతున్నట్టుగా వెల్లడించారు.
ఇప్పటి వరకు శ్రీలీల చేయని ఓ రఫ్ అండ్ ఠఫ్ క్యారెక్టర్ ని చేస్తున్నట్టుగా అయితే, మేకర్స్ హింట్ ఇచ్చారు. అంతేకాదు, ‘ఏజెంట్ మిర్చి’ అని పేరుకు తగ్గట్టే హాట్ హాట్ గానూ కనిపించనుందని సమాచారం. ఇక ఈ ప్రాజెక్ట్ బాలీవుడ్ లో చేయబోతున్నదని తెలుస్తోంది. ఇప్పటికే, హిందీలో చేస్తున్న రెండు సినిమాలు త్వరలో రిలీజ్ కాబోతున్నాయి. ఆషికి 3 పేరుతో రాబోతున్న రొమాంటిక్ లవ్ స్టోరీ కి పేరు కూడా మార్చారని టాక్ వినిపించింది. మరో, సినిమానూ మేకర్స్ రెడీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొత్త ప్రాజెక్ట్ ని కమిటైంది.
ఇక, తెలుగులో మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న సినిమాలో హీరోయిన్‌గా శ్రీలీల నటించింది. ఈ నెల 31వ తేదీ న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా మీద చాలా అంచనాలున్నాయి. ఇంతకముందు రవితేజ, శ్రీలీల నటించిన ధమాకా భారీ కమర్షియల్ హిట్ సాధించింది. ఆ తర్వాత మళ్ళీ, ఇద్దరికీ హిట్ దక్కింది లేదు. మళ్ళీ, ఇప్పుడు రాబోతున్న మాస్ జాతర సినిమాతో హిట్ కొడతామని చాలా నమ్మకంగా ఉన్నారు. చూడాలి మరి, ఏం జరుగుతుందో.
ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని రివీల్ చేసింది చిత్ర…
Ram Charan: భాష ఏదైనా..హీరో ఎవరైనా..ఎంత భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించినా.. కథలో బలం, వాస్తవిక సంఘటనలతో అల్లుకున్న సన్నివేశాలలో…
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఆ తర్వాత వచ్చిన హీరోలందరికీ ఒక ఇన్‌స్పిరేషన్. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు నడుస్తున్న…
Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…
Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా వైడ్‌గా ఏప్రిల్ 30న…
Carmeni Selvam (2026) - Movie Reviews: పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో…
This website uses cookies.