Mana Shankara Varaprasad Garu:చిరు ఈజ్ బ్యాక్..’మీసాల పిల్ల’తో అదిరే స్టెప్పులు..

Mana Shankara Varaprasad Garu: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సినిమా “మన శంకరవరప్రసాద్ గారు”. నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా, ఈ సినిమా నుంచి మొదటి లిరికల్ వీడియో సాంగ్ ‘మీసాల పిల్ల’ రిలీజై యూట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది. చిరంజీవి అంటే డాన్స్ కి పెట్టింది పేరు. ఆయనతో ఏ దర్శకుడు సినిమా చేసినా ముందు పాటలు ఎలా ఉండాలి..ఎలాంటి సందర్భంలో రావాలి..ఏ పాటను ఏ డాన్స్ మాస్టర్ కొరియోగ్రఫీ చేయాలి..? లాంటి లెక్కలు ముందే వేసుకుంటారు.

చిరంజీవి సినిమాలో ఏ ఎలిమెంట్ మిస్ అయినా మెగా ఫ్యాన్స్ హర్ట్ అవడం ఖాయం. ఇక, ఆయన పక్కన హీరోయిన్ లేకపోయినా..డాన్స్ లేకపోయినా మెగా అభిమానులు అల్లాడిపోతారు. వాళ్ళవరకూ ఎందుకు, సినిమాలో సాంగ్స్ లేకపోతే చిరు మనసే చివుక్కుమంటుంది. అందుకే, మెగాస్టార్ సినిమా ఫుల్ మీల్స్ లా ఉంటుంది. ఇక, తాజాగా ఆయన నటిస్తున్న “మన శంకరవరప్రసాద్ గారు” సినిమా నుంచి ‘మీసాల పిల్ల’.. అంటూ సాగే స్లో మెలోడీ సాంగ్ ఒకటి ఫస్ట్ సింగిల్ గా మేకర్స్ వదిలారు.

mana-shankara-varaprasad-garu-chiru-is-back-with-meesala-pilla-song

Mana Shankara Varaprasad Garu: ఉదిత్ నారాయణ్ ఈ పాటతో మళ్ళీ టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు

చాలా ఏళ్ళ తర్వాత ఉదిత్ నారాయణ్ ఈ పాటతో మళ్ళీ టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు. అప్పట్లో, మెగాస్టార్ నటించిన ‘చూడాలి ఉంది’ సినిమాలో ‘రామ్మా చిలకమ్మా’ పాట పాడి టాలీవుడ్ లో సింగర్ గా ఎంట్రీ ఇచ్చారు. అప్పట్లో ఆ క్రెడిట్ దర్శకుడు గుణశేఖర్, మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మలకి దక్కింది. తెలుగులో ఏ హీరోకి ఉదిత్ పాట పాడినా, ఆ సాంగ్ సూపర్ హిట్ అంతే. ఇక, మెగాస్టార్ కి పాడిన ప్రతీపాట బ్లాక్ బస్టర్. అందుకే, ఇప్పుడు అనిల్ రావిపూడి “మన శంకరవరప్రసాద్ గారు” సినిమా కోసం మళ్ళీ తీసుకొచ్చారు.

గ్యారెంటీగా ఈ సాంగ్ కి థియేటర్స్ లో మెగా ఫ్యాన్స్ లేచి డాన్స్ చేస్తారు..అనేలా ఉంది. ‘ఇంద్ర’ సినిమాలో ‘రాధే గోవందా’.. సాంగ్ ఎలా అయితే స్లో పాయిజన్ లా ఎక్కిందో, ఇప్పుడు “మన శంకరవరప్రసాద్ గారు” సినిమాలోని ‘మీసాల పిల్ల’ సాంగ్ కూడా అలాగే ఎక్కేస్తుందనడంలో సందేహం లేదు. భార్యభర్తల మధ్య ‘అలక’ దూరినప్పుడు వచ్చే సందర్భం అని క్లియర్ గా అర్థమవుతుంది. ఈ పాటకి, భీమ్స్ సిసిరోలియో అందించిన మ్యూజిక్, ఉదిత్ నారాయ‌ణ – శ్వేతా మోహ‌న్ వాయిస్, భాస్క‌ర భ‌ట్ల అందించిన సాహిత్యం..మధ్యలో అనిల్ రావిపూడి స్టైల్ ఆఫ్ మేకింగ్..ఇలా అన్నీ పర్ఫెక్ట్ గా సూటయ్యాయి. ఇక సంక్రాంతికి థియేటర్స్ లో పూనకాలు రావడమే ఆలస్యం. కాగా, ఈ సినిమాను సాహు గారపాటి, సుష్మిత కొణిదెల కలిసి నిర్మిస్తున్నారు.

 

 

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

2 weeks ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

2 weeks ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

1 month ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

1 month ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

1 month ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

1 month ago

This website uses cookies.