Smart Phone: ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. చిన్న పిల్లల నుంచి మొదలుకొని పెద్దవారి వరకు కూడా ఫోన్ లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నారు. ఇలా నిరంతరం ఫోన్ కు బానిసలుగా మారడమే కాకుండా ఉదయం బెడ్ మీద కళ్ళు తెరవగానే చేతిలో మొబైల్ ఫోన్ ఉండటం అలవాటుగా మారిపోయింది. ఇలా ఉదయం నిద్ర లేవగానే ఫోన్ చూడటం అనేది చాలా ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మరి ఉదయం నిద్ర లేవగానే ఫోన్ చేతిలో పట్టుకోవడం వల్ల కలిగే అనర్థాలు ఏంటి అనే విషయానికి వస్తే..
ఒత్తిడి పెరుగుదల: రాత్రంతా ప్రశాంతంగా నిద్రపోయి ఉదయం లేవగానే మొబైల్ ఫోన్ చేతిలో పెట్టుకోవడం వల్ల అప్పటికే వచ్చిన నోటిఫికేషన్ అన్ని ఒక్కసారిగా చూడటంతో మన మెదడు పై తీవ్రమైన ఒత్తిడి కలుగుతుంది.ఇది కార్టిసాల్ అనే ఒత్తిడి హార్మోన్ స్థాయిలను అమాంతం పెంచుతుంది. అదేవిధంగా ఏకాగ్రతను కూడా తగ్గిస్తుంది. ఇక రాత్రి పూట వచ్చిన మెసేజ్ చూడటం వల్ల నిరాశ లేదా ఆందోళన కలిగే అవకాశాలు ఎక్కువ.

Smart Phone: మెలటోనిన్ ఉత్పత్తికి ఆటంకం..
కళ్ళ పై ఒత్తిడి: పొద్దు పొద్దునే నిద్ర కళ్లతో ప్రకాశవంతమైన స్క్రీన్‌ని చూడటం వల్ల కళ్ళ పై తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది.తద్వారా కళ్ళు పొడిబారడం, కళ్ళ నుంచి నీరు కారడం, తీవ్రమైన తలనొప్పి వంటి సమస్యలు వెంటాడుతూ ఉన్నాయి.స్క్రీన్‌ల ద్వారా వెలువడే నీలి కాంతి మెలటోనిన్ ఉత్పత్తికి ఆటంకంలా మారడమే కాకుండా నిద్రలేమి సమస్యకు కారణం అవుతుంది. ఇలా ఉదయం నిద్ర లేవగానే ఫోన్ చూడటం వల్ల ఈ విధమైనటువంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే వీలైనంత ఎక్కువగా ఉదయం ఫోన్ చూడకపోవడమే మంచిది. ఇక రాత్రి నిద్రపోయే సమయంలో మన బెడ్డుకు కాస్త దూరంగా ఫోన్ పెట్టడం వల్ల లేవగానే ఫోన్ చూసే వెసులుబాటు ఉండదు. ఉదయం నిద్ర లేచిన తర్వాత 30 నిమిషాల వరకు ఫోన్ చేతిలో పట్టుకోకపోవడమే మంచిది. ఫోన్ కి బదులుగా వ్యాయామం చేయటం వల్ల మానసిక శారీరక ఆరోగ్యాన్నీ పెంపొందించుకోవచ్చు. ఉదయం వాకింగ్ చేయడం కూడా ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరం. ఫోన్ వాడటం బదులుగా ఈ పనులు చేయటం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు

