Chandipura virus: గత మూడు సంవత్సరాల క్రితం కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతులను చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈ వైరస్ కారణంగా కొన్ని లక్షల మంది మరణం పొందారు.. ఇక కరోనా వైరస్ నుంచి పూర్తిగా బయటపడకుండానే మరో వైరస్ పెద్ద ఎత్తున భయాందోళనలకు గురిచేస్తుంది. ఇప్పటికే మన దేశంలో గుజరాత్ ఇతర రాష్ట్రాలలో పెద్ద ఎత్తున చండీ పురా వైరస్ పెద్ద ఎత్తున వ్యాప్తి చెంది 15 సంవత్సరాలలోపు వయసు పిల్లలను బలి చేస్తుంది. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే ఐదుగురు చిన్నారులు ఈ వ్యాధికి గురి అయ్యి మరణించారు.
అసలు ఈ చండీ పురా అనే వ్యాధి ఏంటి ఈ వ్యాధి లక్షణాలు నివారణ చర్యలు ఏంటి ఈ వ్యాధి ఎలా వ్యాప్తి చెందుతుందనే విషయానికి వస్తే..వైరస్ సోకిన వ్యక్తిలో జ్వరం, ఫ్లూ, మెదడువాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. దోమలు, ఇతర కీటకాల ద్వారా ఇది వ్యాప్తి చెందుతుంది. ఇది రాబ్డో విరిడే కుటుంబానికి చెందిన వెసిక్యులో వైరస్ జాతికి చెందినదిగా గుర్తించారు. అయితే ఈ వైరస్ ఎక్కువగా దోమలు ఇతర కీటకాల ద్వారా వ్యాప్తి చెందుతున్నాయి.
ఇలాంటి తరుణంలోనే ఈ వ్యాధిని అరికట్టడానికి ఏకైక మార్గం మన చుట్టూ పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉండటమే ఎక్కడ కూడా నీరు నిలవకుండా దోమలు పెరగకుండా చూసుకోవాలి అలాగే ఇంటి ఆవరణంలో మొక్కలు ఉంటే చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఇలా పరిశుభ్రత ఒక్కటే ఈ వైరస్ వ్యాప్తికి నివారణ అంటూ నిపుణులు సూచిస్తున్నారు.