Sara Ali Khan : బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్ ప్రస్తుతం తన రాబోయే చిత్రం గ్యాస్‌లైట్ విడుదల కోసం వేచి చూస్తోంది. విక్రాంత్ మాస్సే , చిత్రాంగద సింగ్ నటిస్తున్న గ్యాస్‌లైట్ అనేది పవన్ కిర్పలాని దర్శకత్వం వహించిన మిస్టరీ థ్రిల్లర్ మూవీ . ఈ చిత్రం OTT ప్లాట్‌ఫారమ్ డిస్నీ+హాట్‌స్టార్‌లో మార్చి 31న విడుదల కానుంది. ప్రస్తుతం సారా పూర్తి స్వింగ్‌లో చిత్రం ప్రమోషన్‌లతో బిజీగా ఉంది. నటి తాజాగా తన ప్రమోషన్ డైరీల నుండి చిత్రాల స్ట్రింగ్‌ను పంచుకుంది. కుర్రాళ్ళ హృదయాలను దోచుకుంది.

సారా ఫ్యాషన్ డిజైనర్ అలెక్స్ పెర్రీకి మ్యూజ్ గా వ్యవహరించింది. మూవీ ప్రమోషన్‌ల కోసం డిజైనర్ షెల్ఫ్‌ల నుండి తెల్లటి కో-ఆర్డ్ సెట్‌ను ఎంచుకుంది. ఈ అవుట్ ఫిట్ లో సారా ఎంతో హాట్ గా కనిపిస్తోంది.

కార్సెట్ వివరాలతో, సన్నటి స్ట్రిప్స్ తో వచ్చిన డీప్ నెక్ లైన్ కలిగిన తెల్లటి స్లిప్ క్రాప్డ్ టాప్‌లో సారా ఎంతో అందంగా కనిపించింది, వెడల్పు కాళ్లతో వచ్చిన తెల్లటి హై-వెయిస్ట్ ఫార్మల్ ట్రౌజర్‌తో ను ఈ టాప్ కు జత చేసింది ఈ బ్యూటీ.

ఈ వైట్ కలర్ కో ఆర్ సెట్ పిక్స్ ను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసి గ్యాస్‌లైట్ ప్రమోషన్ చేస్తోంది. ఈ పిక్స్ తో పాటు కాప్షన్ ను పోస్ట్ చేసింది. మీకు భయం ఉంటుందని ఆశిస్తున్నాను. కానీ ఇది ఒక గొప్ప రాత్రి. కాబట్టి గట్టిగా కూర్చోండి, అని సారా మెన్షన్ చేసింది.

సారా ఈ అవుట్ ఫిట్ కు తగ్గట్లుగా తెల్లటి హూప్ చెవిపోగులు , తెల్లటి ఫుట్ వేర్ తో తన రూపాన్ని మరింత యాక్సెసరైజ్ చేసింది. తన కురులతో కొప్పు చుట్టుకుని స్టైలిష్ లుక్స్ తో మేస్మెరిసె చేసింది.

మేకప్ ఆర్టిస్ట్ వర్దన్ నాయక్ సహాయంతో, సారా అందంగా ముస్తాబు అయ్యింది. కనులకు న్యూడ్ ఐషాడో, బ్లాక్ ఐలైనర్, మస్కరాతో నిండిన కనురెప్పలు, గీసిన కనుబొమ్మలు, కాంటౌర్డ్ చెంపలు ఎరుపు రంగు లిప్‌స్టిక్‌తో ఎంతో గ్లామరస్ గా మెరిసిపోయింది.