Sun. Nov 16th, 2025

    Samantha: ఇండస్ట్రీలో అందరూ కలిసి మెలిసి ఉంటారు. కానీ, అభిమానులకి ఈ విషయం తెలీదు. అందుకే, ఇద్దరు హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద రిలీజ్ అంటే కొట్టుకుంటుంటారు. వాస్తవానికి అసలు ఆ ఇద్దరు హీరోల మధ్య మంచి బాండింగ్, రిలేషన్ ఉంటుంది. కానీ, అభిమానుల మధ్య మాత్రం ఈ బాండింగ్ ఉండదు. ఇక ఇండస్ట్రీలో హీరోల పిల్లల్ని పెళ్లి చేసుకొని బంధుత్వం ఏర్పరుచుకుంటున్న సంగతి తెలిసిందే.

    నాగార్జున, వెంకటేశ్ దీనికి ఉదాహరణ. అలాగే, బాలకృష్ణ ఇంటికి అక్కినేని నాగార్జున కొడుకు నాగ చైతన్య అల్లుడుగా వెళ్ళాల్సిందట. బాలయ్య చిన్న కూతురుకి నాగచైతన్యతో పెళ్లి చేయాలనుకున్నారట. కానీ, అప్పటికే నాగ చైతన్య..సమంతతో డీప్ లవ్ లో ఉన్నారు. దాంతో నాగార్జున చైతూని చాలాసార్లు కన్విన్స్ చేయడానికి ట్రై చేసి డ్రాపయ్యాడు.

    samantha- Naga Chaitanya is supposed to be Balayya's son-in-law..dammit the whole story is reverse
    samantha- Naga Chaitanya is supposed to be Balayya’s son-in-law..dammit the whole story is reverse

    Samantha: సమంత, నాగ చైతన్యల వివాహం జరిపించారు. 

    తప్పనిసరి పరిస్థితుల్లో సమంత, నాగ చైతన్యల వివాహం జరిపించారు. రెండు మత సాంప్రదాయాల ప్రకారం గోవాలో ఎంతో ఘనంగా చైతూ-సామ్ పెళ్లి జరిగింది. ఈ వేడుకకి ఇండస్ట్రీ ప్రముఖులందరూ హాజరయ్యారు. అయితే, అనూహ్యంగా సమంత-నాగ చైతన్య విడాకులు తీసుకున్నారు. సోషల్ మిడియా ద్వారా ఇద్దరు ప్రకటించినప్పుడు ఇండస్ట్రీతో పాటు అభిమానులు షాకయ్యారు.

    ఆ తర్వాత నాగార్జున అనుకున్నారట. చైతూ నేను చెప్పినమాట విని బాలయ్య చిన్న కూతురిని పెళ్లి చేసుకొని ఉంటే ఇప్పుడు ఇలాంటి సమస్యలు వచ్చేవి కాదని లోలోపల కుమిలిపోయాడట. ఇప్పుడేమో చైతూ నటి శోభిత ధూళిపాళ్ల తో రిలేషన్ లో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇక బాలయ్య తన చిన్న కూతురుకి గొప్ప సంబంధం తీసుకొచ్చి ఎంతో ఘనంగా వివాహం చేశాడు.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.