Pawan Kalyan : ఆదివారం వెలువడిన తెలంగాణ ఎన్నికల ఫలితాలతో జనసేన పార్టీ ప్రభావం రాష్ట్రంలో ఎలా ఉంటుందో ఫుల్ క్లారిటీ వచ్చేసింది. భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్ల జరిగిన నష్టం క్లియర్ కట్‌గా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎలక్షన్లలో తెలుగుదేశం పార్టీతో నడవాల్సి ఉన్న నేపథ్యంలో ఇకపై గట్టి ప్రణాళికతో జాగ్రత్తగా వ్యవహరించాలని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు అర్థమైంది. వచ్చే మూడు నాలుగు నెలల్లో ఏపీలోనూ ఎన్నికల నగారా మోగనుంది. తెలంగాణలో అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రజలు షాక్ ఇచ్చినట్టుగా ఆంధ్రప్రదేశ్‌లోనూ అదే సీన్ రిపీట్ అవుతుందని విశ్లేషణలు షురూ అయ్యాయి. ఈ క్రమంలో జనసేనాని పవన్ మరింత చురుకుగా రాజకీయ రణక్షేత్రంలో ఉండాల్సిన అవసరం ఉందని తెలుస్తోంది.

అయితే ఎలక్షలు దగ్గర పడుతుండటంతో పవన్ ప్రొడ్యూజర్లలో వణుకు పుడుతోంది. తక్కువో ఎక్కువో కాసిన్ని డేట్లు ఇస్తే సినిమా షూటింగ్ చేసుకుందామని వేయి కళ్లతో పాపం ఎదురు చూస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఇప్పట్లో షూటింగ్ స్పాట్ కి వచ్చే ఛాన్స్ లేదని ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల ప్రొడ్యూజర్లకు అర్థమైపోయింది. మొన్ననే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కూడా జైలు నుంచి బయటికి వచ్చారు. దీంతో పవన్ ఏపీ పాలిటిక్స్ కే ఎక్కు ప్రాధాన్యత ఇస్తారని భావిస్తున్నారు. ఎందుకంటే ఎలక్షన్లలో పవన్ , టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి ఉమ్మడి స్ట్రాటజీలు, ప్లానింగులు, డిస్కషన్లు, టూర్లు , పరస్పర మద్దతులు ఇలా చాలా వ్యవహారాలు ఉంటాయి. ఇప్పటికే వారాహికి చాలా రోజుల గ్యాప్ వచ్చేసింది. ఇకపై ఎన్నికల్ నేపథ్యంలో ఏపీలోని నియోజకవర్గాల వారిగా టూర్స్ కి వెళ్లాల్సి ఉంటుంది. ఇంతటి క్లిష్టమైన షెడ్యూల్ లో సినిమా షూటింగులంటే ప్లానింగ్ మీద దెబ్పడే ఛాన్స్ ఉంది. అందుకే షూటింగ్స్ ఆగాల్సిందేనని అర్థమవుతోంది.

ఎన్నికల వరకు అయితే ఓకే కానీ తెలంగాణలో జరిగినట్లుగా ఒకవేళ ఏపీలో టిడిపి-జనసేన కనక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే పవన్ కళ్యాణ్ ప్రొడ్యూజర్ల వెయిటింగ్ టైం పెరిగే అవకాశం ఉ:ది. ఒకవేళ ఊహించినట్లుగా సానుకూల ఫలితాలు రాకపోతే ప్రొడ్యూజర్లు ఊపిరి పీల్చుకుని ప్రాజెక్ట్స్ షెడ్యూల్స్ మొదలుపెట్టుకోవచ్చు. అయితే ఇదంతా ఇప్పట్లో తేలే విషయం కాదు . కాబట్టి ఎలక్షన్లు అయ్యే వరకు వెయిట్ చేయక తప్పదేమో. ఎందుకంటే అంతకంటే పాపం ప్రొడ్యూజర్లు ఏం చేయలేరు. అయితే 2024 సమ్మర్ లోగా పవన్ కళ్యాన్ కొత్త సినిమా వెండితెరపై చూడాలని పాపం వేయి కళ్లతో కోట్లాది మంది పవన్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ లెక్కన ప్రస్తుత పరిస్థితిని గమనిస్తే అభిమానులకు నిరాశ తప్పదన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఎన్నికల సమయం కాబట్టి పవన్ పూర్తిగా రాజకీయాలపైనే తన దృష్టిని కేంద్రీకరించనున్నారు.
