salaar: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నేడు సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఇప్పటికే పెద్ద ఎత్తున థియేటర్లలో ప్రేక్షకులను సందడి చేస్తుంది. ఇప్పటికే బెనిఫిట్ షోలు పూర్తయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాలలో థియేటర్ల వద్ద పెద్ద ఎత్తున ప్రభాస్ అభిమానులు సందడి చేస్తున్నారు. కే జి ఎఫ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన సినిమా కావడంతో ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి.
ఇక ఈ సినిమా ప్రేక్షకులను అనుకున్న విధంగానే ఆకట్టుకుందా లేదా అసలు ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ ఏంటి అనే విషయానికి వస్తే.. ఈ సినిమా నుంచి విడుదల చేసిన ట్రైలర్ టీజర్స్ కనుక చూస్తే ఈ సినిమా భారీ యాక్షన్ సినిమా అని అనిపిస్తుంది. అయితే ఈ యాక్షన్ సినిమాలో అక్కడక్కడ కొన్ని చిన్న చిన్న మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయని తెలుస్తోంది. ఈ సినిమా ఇంటర్వెల్ క్లైమాక్స్ సన్నివేశాలు అద్భుతంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
ప్రభాస్ లుక్స్ సలార్ కు హైలెట్ గా నిలవగా ప్రభాస్ నట విశ్వరూపం సలార్ అని చెప్పవచ్చు. కథ సింపుల్ గానే ఉన్నప్పటికీ ప్రశాంత్ మాత్రం తన స్టైల్ లో ఈ సినిమాని చాలా డిఫరెంట్ గా పేక్షకులు అభిరుచిగా అనుగుణంగా తెరపైకి తీసుకువచ్చారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతిహాసన్ నటించిన శృతిహాసన్ పాత్రకు చాలా మంచి ప్రాధాన్యత ఉందని చెప్పాలి.
ఈ సినిమాలోని యాక్షన్స్ సన్ని వేషాలు స్నేహితుల మధ్య వచ్చే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు కూడా పెద్ద ఎత్తున అందరిని ఆకట్టుకున్నాయి. మ్యూజిక్ కూడా ఎంతో అద్భుతంగానే ఉందని చెప్పాలి. మొత్తానికి ప్రభాస్ అభిమానులు మాత్రం సలార్ సినిమా ద్వారా దిల్ కుష్ అవుతున్నారు. బాహుబలి సినిమా తర్వాత ఆ రేంజ్ లో ప్రభాస్ కు హిట్ రాలేదని చెప్పాలి కానీ సలార్ మాత్రం బాహుబలి సినిమా రికార్డులను బ్రేక్ చేస్తుందని తెలుస్తోంది. టాక్ పరంగా ఈ సినిమా మంచి సక్సెస్ అందుకోగా కమర్షియల్ గా ఎలాంటి సక్సెస్ అవుతుంది అనే విషయాలు మరొక రెండు రోజులలో తెలియనున్నాయి.