Salaar: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన తాజా చిత్రం సాలార్ సినిమా నేడు ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే పలు ప్రాంతాలలో బెనిఫిట్ షోలు కూడా పూర్తి అయ్యాయి అలాగే ఈ సినిమాపై పాజిటివ్ టాక్ ఏర్పడటంతో ప్రభాస్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఎంతోమంది సినీ సెలబ్రిటీలకు ట్విట్టర్ వేదికగా ఈ సినిమా రివ్యూ తెలియజేస్తున్నారు. ఇక ప్రభాస్ నటించిన ఈ సినిమా చూడటానికి కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయి. మరి ఆ కారణాలు ఏంటి ఏ కారణం చేత ఈ సినిమా చూడవచ్చు అని విషయానికి వస్తే..
ఈ సినిమా చూడటానికి ప్రధాన కారణం ప్రభాస్ అని చెప్పాలి. పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ప్రభాస్ నటించిన సినిమా కావడంతో అభిమానులు ఈ సినిమా చూడటానికి ఆసక్తి చూపుతున్నారు. ఇక ఈ సినిమాలో ట్రైలర్ టీజర్ విడుదల చేయగా ప్రభాస్ ఎలివేషన్స్ చూసి ఎప్పుడెప్పుడు ఈ సినిమాని తెరపై చూస్తామన్న ఆత్రుత అందరిలోనూ నెలకొంది.
ఈ సినిమాకు డైరెక్టర్ ప్రశాంత్ కావడంతో ఈ సినిమాని చూడటానికి కూడా ఒక ప్రధాన కారణం కావచ్చు. కేజిఎఫ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ప్రశాంత్ తదుపరి ప్రభాస్ సినిమా చేస్తున్నారు అంటే ఈ సినిమాపై భారీ స్థాయిలోనే అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా చూడటానికి డైరెక్టర్ ప్రశాంత్ కూడా ఒక కారణమని చెప్పాలి. ప్రభాస్ కి ప్రశాంత్ నీల్ ఇచ్చే ఎలివేషన్స్ ఎలా ఉంటాయో చెప్పాల్సిన పనిలేదు.
ఫ్రెండ్షిప్: ఈ సినిమా ఇద్దరి స్నేహితుల మధ్య కొనసాగుతుందని ట్రైలర్ విడుదల చేసిన సమయంలోనే అర్థమవుతుంది.ఖాన్సార్ అనే సిటీ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతోంది. ట్రైలర్స్ లో ప్రశాంత్ నీల్ పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రభాస్ మధ్య ఫ్రెండ్ షిప్ నే హైలైట్ చేశారు.
యాక్షన్: ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్ గనుక చూస్తే ఈ సినిమాలో అద్భుతమైనటువంటి యాక్షన్స్ సన్ని వేషాలు కూడా ఉన్నాయని అర్థమవుతుంది.ఒక్కఒక్క ఫైట్ నెవర్ బిఫోర్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని.. వయెలెన్స్ లెవల్ ఊహించలేని విధంగా ఉంటుందని అంటున్నారు. ఇలా ఈ సినిమా చూడటానికి ఇవే ప్రధాన కారణాలని చెప్పవచ్చు.