Rakul Preet Singh : టాలీవుడ్లో రకుల్ ప్రీత్ సింగ్ కు మంచి క్రేజ్ ఉంది. ఈ భామ ఫామ్ లో ఉన్నప్పుడు స్టార్ హీరోస్ తో స్క్రీన్ షేర్ చేసుకుని తెలుగు ప్రేక్షకులను అలరించింది. టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, ఎన్టీఆర్, రాంచరణ్, బన్నీ లాంటి టాప్ స్టార్స్ సరసన నటించి స్టార్ హీరోయిన్ స్టేటస్ అనుభవించింది. కానీ ఒక్కసారిగా అమ్మడి గ్రాఫ్ పడిపోయింది. దీంతో బాలీవుడ్ చెక్కేసింది. అక్కడ కూడా రకుల్ కు అనుకున్నంతగా అవకాశాలు దక్కలేదు. దీంతో అమ్మడు పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యింది. ప్రముఖ నిర్మాత జాకీ భగ్నానీనీ ఈ నెల 21న పెళ్లి చేసుకోబోతోంది రకుల్. చాలా రోజుల లవ్ జర్నీ తర్వాత ఈ ప్రేమ పక్షులు తమ పెళ్లిని చాలా గ్రాండ్ గా చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. వీరి వెడ్డింగ్ కి సంబంధించిన పెళ్లి పత్రిక తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నిజానికి రకుల్ పెళ్లి చేసుకుంటుంది అన్న న్యూస్ నిజమే కానీ ఎక్కడ ఎప్పుడు చేసుకుంటుంది అనే దానిపై ఇప్పటివరకైతే క్లారిటీ లేదు. ఈ క్రమంలో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వెడ్డింగ్ కార్డుతో ఈ భామ గోవాలో పెళ్లి చేసుకోబోతోంది అన్న క్లారిటీ వచ్చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వెడ్డింగ్ కార్డ్ హైలెట్ గా నిలుస్తోంది. గోవా అందాలతో నిండిన వీరి వెడ్డింగ్ కార్డ్ ఎంతో అద్భుతంగా ఉంది. తెలుపు, నీలం రంగుల్లో ఉన్న ఈ శుభలేఖలో మండపం చుట్టూ కోకోనట్ ట్రీస్,సముద్రం బ్యాక్‌డ్రాప్‌లో ముద్రించారు. అలాగే ‘అబ్‌దోనోభగ్నా-ని’అన్న హ్యాష్‌ట్యాగ్‌ను కార్డుపై ముద్రించారు.
ఎట్టకేలకు రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీల పెళ్లి గోవాలో గ్రాండ్ గా జరగబోతోంది. నిజానికి ఈ లవ్ బర్డ్స్ తమ పెళ్లిని మాల్దీవ్స్ లో ప్లాన్ చేశారు. అయితే మాల్దీవ్స్ తో గొడవల కారణంగా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. దేశ ప్రధాని మోదీ కూడా లక్షద్వీప్ కి వెళ్లి అక్కడ ఫొటో షూట్ చేసిన సంగతి తెలిసిందే. భారత్ టూరిస్ట్ స్పాట్స్ ను స్వయంగా మోదీ ప్రమోట్ చేయడంతో రకుల్ మోదీ మాటలకు బాగా ఇన్స్పైర్ అయ్యింది. అందుకే గోవాలో వెడ్డింగ్ ప్లాన్ చేశారు. కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది బంధువులు, క్లోజ్ ఫ్రెండ్స్ ని మాత్రమే ఈ పెళ్లి వేడుకకు ఈ లవ్ బర్డ్స్ ఆహ్వానిస్తున్నారు.