Health Tips: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఇంటి నుంచి పని చేయడం వల్ల చాలామంది ఎక్కువగా కూర్చుని పని చేయడం చేస్తున్నారు ఇలా ఎక్కువగా గంటలు తరబడి కూర్చొని పనిచేయడం వల్ల మీరు ప్రమాదంలో పడినట్లేదని తైవాన్‌కు చెందిన పరిశోధనా సంస్థ వెల్లడించింది. జామా నెట్‌వర్క్ ఓపెన్ జర్నల్‌లో ప్రచురించారు. ఎక్కువ సమయం కూర్చునే వారిపై 13 ఏళ్ల పరిశోధన తరువాత దీనిని ప్రచురించినట్లు పరిశోధకులు తెలిపారు.
ఎక్కువ సమయం కూర్చుని పని చేసే వారు కార్డియో వాస్కులర్ డిసీజ్‌తో మరణించే ప్రమాదం ఎక్కువ అని తేలింది. ఇతర వ్యక్తులకు కంటే 34 శాతం మంది ఎక్కువగా గుండెపోటుతో మరణించే అవకాశాలు ఉంటాయని ఈ పరిశోధనలో వెల్లడించారు.నిరంతరం కూర్చోవడం వల్ల బ్లడ్ షుగర్, అధిక రక్తపోటు, ఊబకాయం, నడుము చుట్టూ కొవ్వు పేరుకుపోయే ప్రమాదం పెరుగుతుంది. దీని ద్వారా గుండె ప్రమాదాలు అధికమవుతాయి.
8 గంటల కంటే ఎక్కువ సమయం నిరంతరంగా కూర్చుని పని చేసే మహిళ ఆరోగ్యం త్వరగా క్షీణిస్తుందని ఈ పరిశోధనలో పేర్కొన్నారు. కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, వాపు వంటి ప్రమాదకరమైన వ్యాధులు మహిళల్లో త్వరగా వస్తాయని, అందుకే ఫిట్‌నెస్ పై శ్రద్ధ వహించాలని సూచిస్తున్నారు నిపుణులు తెలియజేస్తున్నారు అందుకే ఎక్కువసేపు ఒకే చోట కూర్చుని పని చేయకుండా గంటకు ఒకసారి అయిన కాస్త విరామం తీసుకుని పనిచేయడం ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.