Thu. Nov 13th, 2025

    Technology: మన దేశంలో వాయు కాలుష్యం తీవ్రమైన సమస్యగా మారింది. పెరుగుతున్న ఆటోమొబైల్ వినియోగదారులతో, భారతదేశంలో వాయు కాలుష్యం స్థాయి మితిమీరి మరీ పెరిగిపోతోంది. ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ క్లీన్ ట్రాన్స్‌పోర్టేషన్ ప్రకారం, రవాణా వనరులు భారతదేశంలోని రేణువుల కాలుష్యంలో దాదాపు మూడింట ఒక వంతు వాటాను కలిగి ఉన్నాయని నిర్ధారించింది. 2020లో, భారతదేశం ప్రపంచంలో అత్యంత కలుషితమైన దేశంగా 3వ స్థానంలో నిలిచింది, ఇందులో ఆటోమొబైల్స్ ప్రధాన పాత్రను పోషించాయి.

    భారతదేశంలో EV కదలికను వేగవంతం చేయడానికి ప్రభుత్వం తన శాయశక్తులా ప్రయత్నిస్తున్నప్పటికీ, చాలా మంది ప్రజలు పెరుగుతున్న కాలుష్యంపై పెద్దగా శ్రద్ధ చూపడం లేదు సరికదా వారి వాహన కాలుష్యాన్ని సమయానికి తనిఖీ చేయించకపోవడం వల్లే ఇలాంటి సమస్య ఉత్పన్నమవుతోంది. ఈ సమస్యను పరిష్కరించడానికి, గురుగ్రామ్ ఆధారంగా ఓ ఈ పొల్యూషన్ అనే యాప్ అందుబాటులోకి వచ్చింది. ఈ యాప్ ద్వారా వినియోగదారులకు వారి వాహన కాలుష్యం గడువు ముగియబోతుందని తెలియజేయడంతో పాటు యాప్ ద్వారా దాన్ని పూర్తి చేయడానికి వారికి సౌకర్యాన్ని కల్పిస్తోంది.

    puc certificate by using this appఆదిత్య బోబల్, శిఖర్ స్వరూప్‌చే స్థాపించిన ఈ పొల్యూషన అనేది వాహన కాలుష్య గడువు నోటిఫికేషన్ యాప్. ఇది వినియోగదారులకు వారి వాహన కాలుష్యం గడువు ముగిసినప్పుడు ఆటోమేటిక్‌గా గుర్తు చేస్తుంటుంది. ఇది భారతదేశం యొక్క ఏకైక వాహన కాలుష్యం గడువు నోటిఫికేషన్ యాప్. ఇప్పటి వరకు ఇలాంటి యాప్ ఎక్కడా అందుబాటులో లేదు. ఇది వినియోగదారులకు సమాచారం అందించడంతో పాటు వారి వాహనం కాలుష్యం నియంత్రణలో ఉందని సర్టిఫికేట్‌ను సమయానికి పొందేలా చేస్తుంది. ఆదిత్య, శిఖర్‌లు తమ వాహన కాలుష్యాన్ని సకాలంలో తనిఖీ చేయడం మరచిపోయి, అనుమతించదగిన స్థాయిలో ఎమిషన్ లేని వారి వాహనాన్ని నడపడం వల్ల కలిగే వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి ఈ పొల్యూషన్‌ యాప్ ను ప్రారంభించారు.

    వాయు కాలుష్యానికి వాహనాలు అత్యంత సాధారణ కారణం. 5 మిలియన్ల కంటే ఎక్కువ వాహనాలు వాటి వద్ద చెల్లుబాటు అయ్యే పొల్యూషన్ చెక్ సర్టిఫికేట్ లేనందుకు జరిమానా విధించబడ్డాయి. ఇదంతా ఎందుకంటే 10 మందిలో 9 మందికి వారి PUC గడువు తేదీ గుర్తుండదు. వారు సమయానికి కాలుష్య తనిఖీని పొందడం మర్చిపోతారు, ఫలితంగా చెల్లుబాటు అయ్యే PUC సర్టిఫికేట్ లేనందుకు ట్రాఫిక్ పోలీసులచే జరిమానా విధించబడుతుంది. అంతే కాదు వాతావరణంలో కాలుష్యం ఏర్పడుతుంది. కాబట్టి, ప్రజలు తమ PUC సర్టిఫికేట్ స్టేటస్‌ ను అప్‌డేట్ చేయడం కోసం, వారి నిర్లక్ష్యానికి జరిమానా విధించబడకుండా ఉండటానికి, ఆదిత్య , శిఖర్ లు ఈ పొల్యూషన్‌ను ప్రారంభించారు.

    ప్రస్తుతం ఈ కంపెనీ దాని బీటా వెర్షన్ ద్వారా పనిచేస్తోంది. ఇంకా యాప్ యొక్క ఆన్‌డ్రాయిడ్, iOS వెర్షన్‌లను ప్రారంభించలేదు. త్వరలో వినియోగదారులు యాప్ నుండి PUC సర్టిఫికేట్ కోసం వారి స్లాట్‌ను బుక్ చేసుకోగలిగే వెసులుబాటును కల్పించనున్నారు. ఈ స్టార్టప్ ప్రస్తుతం గురుగ్రామ్ ప్రాంతంపైనే దృష్టిసారించింది. ఆ ప్లాట్‌ఫారమ్‌లో ఎక్కువ మంది వినియోగదారులతో, ఈ పొల్యూషన్ త్వరలో మరిన్ని నగరాలకు విస్తరిస్తుందని వ్యవస్థాపకులు తెలిపారు.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.