Sun. Nov 16th, 2025

    Prabhas: పాన్ ఇండియన్ స్టార్ Prabhas ‘KGF’ చిత్రాల క్రేజీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కిన భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ Salaar. ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో అంచనాలుండగా అసలు ఈ మూవీ స్టోరీ ఏంటీ..? అని ప్రభాస్ ఫ్యాన్స్ దగ్గర్నుంచి అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో దర్శకుడే Salaar కథేంటో చిన్న లైన్ ద్వారా లీక్ చేశారు.

    శృతి హాసన్, పృథ్విరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటించారు. హోంబలే నిర్మాణ సంస్థలో విజయ్ కిరంగదూర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అయితే, తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ Salaar కథ ఇద్దరు ప్రాణ స్నేహితులకి సంబంధించినది. వారు అనుకోని కారణాల వల్ల బద్ద శత్రువులుగా మారతారు. ఈ నేపథ్యంలో కథ సాగుతుంది. యాక్షన్ తో పాటు సెంటిమెంట్ ఎమోషన్స్ కూడా ఉంటాయి.

    Prashant Neel narrated the story of 'Salaar'..surely this is a 1000 crore movie
    Prashant Neel narrated the story of ‘Salaar’..surely this is a 1000 crore movie

    Prabhas: Salaar ని రెండు భాగాలుగా తీయడం లేదు. 

    ప్రభాస్, పృథ్విరాజ్ సుకుమారన్ లాంటి స్టార్ ఉన్నారని Salaar ని రెండు భాగాలుగా తీయడం లేదు. కథ మొత్తం 6 గంటల వరకూ వచ్చింది. అందుకే, రెండు భాగాలుగా ప్లాన్ చేశామని క్రేజ్ కోసం కాదని క్లారిటీ ఇచ్చారు. మొదటి భాగం ఈ డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా అన్ని సౌత్ భాషలతో పాటు బాలీవుడ్ లో కూడా రిలీజ్ అవుతుంది. ఈ సినిమాకి గట్టి పోటీగా ‘Dunki’ ఉంది. ఇక రెండవ భాగం ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది ఇంకా క్లారిటీ లేదు.

    కాగా, Salaar పూర్తైయ్యాక సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ‘Spirit’ చిత్రాన్ని చేయనున్నాడు. ఇప్పటికే, ‘Kalki’ సినిమా షూటింగ్ లో కూడా ప్రభాస్ పాల్గొంటున్నాడు. ఇది సైంటిఫిక్ థ్రిల్లర్ గా పాన్ వరల్డ్ స్థాయిలో రూపొందుతోంది. బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్, దీపిక పడుకొన్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇది కాకుండా మారుతి దర్శకత్వంలో కూడా ప్రభాస్ ఒక సినిమా చేయనున్నాడు.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.