Somavathi Amavasya: మన హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతినెల చివరిన వచ్చే అమావాస్యను ఎంతో శుభకరమైనదిగా భావిస్తా ఉంటారు ఈ అమావాస్య రోజు పెద్ద ఎత్తున పూజలు పరిహారాలను చేస్తూ ఉంటారు. ఇలా ప్రతినెల అమావాస్యను జరుపుకుంటూ ఉంటారు అయితే ఈ నెలలో కూడా అమావాస్య సోమవారం రాబోతోంది.పంచాంగం ప్రకారం ఈసారి అమావాస్య 8 ఏప్రిల్ 2024 సోమవారం వచ్చింది. సోమవారం నాడు వచ్చే అమావాస్యని సోమవతి అమావాస్య అని అంటారు.
అన్ని అమావాస్యల్లో సోమవతి అమావాస్య చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. సోమావతి అమావాస్య రోజున స్నానం, దానంతో పాటు పితృపూజ కూడా చేస్తారు, అందుకే ఈ రోజున కొన్ని చర్యలు చేస్తే పితృదోషం నుండి ఉపశమనం పొందుతారు. సోమావతి అమావాస్య రోజున ఏ విధమైనటువంటి పరిహారాలు చేయడం వల్ల పితృ దోషాలు తొలగిపోతాయి అనే విషయానికి వస్తే ..
సోమవతి అమావాస్య రోజున నల్ల నువ్వులను దానం చేయడం చాలా ముఖ్యమైనది. కాబట్టి ఈ రోజున నల్ల నువ్వులను దానం చేయాలి. ఇలా చేయడం వలన పితృ దోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు అందుకే ఈ నల్ల నువ్వులను దానం చేయడంతో పితృ దోషాలు తొలగిపోయి పితృదేవతల ఆశీర్వాదాలు పొందడం వల్ల సకల సపతులు కలుగుతాయి. ఈ రోజున రావి చెట్టు క్రింద 11 దేశీ నెయ్యి దీపాలను వెలిగించి.. పూర్వీకులను నిర్మలమైన హృదయంతో పూజించడం వల్ల పితృదేవతలు సంతోష పడతారు. ఇక పాలు, అన్నం దానం చేయడం కూడా చాలా ముఖ్యమైనది. అందుకే నల్ల నువ్వులతో పాటు పాలు , అన్నం కూడా దానం చేయాలి. ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు.