Thu. Jul 10th, 2025

    Naga Chaitanya: ‘నాకంటే సమంత గ్రేట్’.. అంటూ అక్కినేని నాగ చైతన్య మాజీ భార్య సమంత గురించి పాజిటివ్‌గా మాట్లాడుతూ ప్రశంసల వర్షం కురిపించారు. సమంత, నాగ చైతన్య విడిపోయిన దగ్గర్నుంచీ ఇప్పటి వరకూ ఈ విధమైన కామెంట్స్ చైతూ సమంత గురించి చేయలేదు. సమంత మొదటి సినిమా ఏ మాయ చేశావే నుంచి ఇద్దరు ఎంత గాఢంగా ప్రేమించుకున్నారో అందరికీ తెలిసిందే.

    ఆ తర్వాత వివాహం, విడాకుల గురించి ప్రతీ ఒక్కరికీ చాలా క్లియర్‌గా తెలుసు. విడిపోయిన తర్వాత కొంతకాలం సమంత తన ఇన్స్టాగ్రాం లో పోస్ట్లు పెడుతూ వచ్చింది. ఆ పోస్టులు చూస్తే ఖచ్చితంగా నాగ చైతన్యని ఉద్దేశించే అనిపించింది. అవి సోషల్ మీడియాలోనూ ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. అయితే, గత మూడు నాలుగు నెలల నుంచి మళ్ళీ వీరిద్దరు కలవబోతున్నారనే మాట అంతటా వినిపిస్తోంది.

    naga-chaitanya- 'Samantha is greater than me'..she has earned all that herself..
    naga-chaitanya- ‘Samantha is greater than me’..she has earned all that herself..

    Naga Chaitanya: సమంత మీద తనకున్న అభిప్రాయాన్ని బాగా చెప్పారు.

    ఇటీవల వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల వివాహానికి సమంత, నాగ చైతన్య హాజరయ్యారు. ఇద్దరు వేరే వేరే ఫ్లైట్స్‌లో వెళ్ళినా, అక్కడ మాత్రం ఎదురుపడటం అందరికీ కాస్త ఎగ్జైటింగ్‌గా అనిపించింది. ఒకరినొకరు చూసుకొని సైలెంట్‌గా వెళ్ళిపోయారు. అయితే, నాగ చైతన్య ఈ మధ్య ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఎవరూ ఊహిచని రీతిలో పాజిటివ్ కామెంట్స్ చేశాడు.

    నాకంటే అన్నీ ఉన్నాయి..పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చాను. హీరో అవడానికి ఏమీ కష్టపడలేదు. కానీ, సమంత అలా కాదు, మొదట్నుంచీ ఎన్నో కష్టాలు అనుభవించింది. ఈ స్థాయికి చేరుకోవడానికి చాలా భరించింది. తనలా ఎవరూ ఉండరు. చాలా పట్టుదల..అనుకున్నది సాధిస్తుంది. విడాకులు అయినంత మాత్రాన ఎందుకు ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోవాలి..అంటూ సమంత మీద తనకున్న అభిప్రాయాన్ని బాగా చెప్పారు. ఈ వీడియో చూశాక అటు సమంత అభిమానులు ఇటు నాగ చైతన్య అభిమానులు చైతూని పొగడ్తలతో ముంచేస్తున్నారు.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.