Dhana Trayodashi: దీపావళికి వచ్చే రెండు రోజుల ముందు రోజున ధన త్రయోదశిగా జరుపుకుంటారు ఇలా ప్రతి ఏడాది దీపావళి పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటాము ఇక ఈ ఏడాది కూడా నవంబర్ 12వ తేదీ దీపావళి పండుగ కాగా పదవ తేదీ ధన త్రయోదశి పండుగను ఎంతో ఘనంగా చేసుకుంటారు. ఈ రోజున లక్ష్మీదేవికి ప్రత్యేకంగా పూజలు చేసి అమ్మవారి అనుగ్రహం పొందడం కోసం ప్రార్థనలు చేస్తారు. ఇక ధన త్రయోదశి రోజు బంగారం లేదా చీపురు వాటి ముఖ్యమైన వస్తువులను కొనుగోలు చేయటం వల్ల కూడా లక్ష్మీదేవి కరుణ కటాక్షాలు మనపై ఉంటాయని భావిస్తారు.
ఇకపోతే ధన త్రయోదశి రోజు కొన్ని వస్తువులను అసలు కొనకూడదు. ఇలా ధన త్రయోదశి రోజు ఈ వస్తువులను కొనుగోలు చేయటం వల్ల కొన్ని రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని పండితులు చెబుతున్నారు. మరి తన త్రయోదశి రోజు ఏ వస్తువులను కొనుగోలు చేయకూడదు అనే విషయానికి వస్తే… ధన త్రయోదశి రోజు ఇనుము అసలు కొనకూడదు ఇనుముతో తయారు చేసిన వస్తువులను కూడా ఈ పండుగ రోజు కొనక పోవడం ఎంతో మంచిది.
ధన త్రయోదశి రోజు ఇనుప వస్తువులను కొనుగోలు చేయటం వల్ల కుబేరుడి అనుగ్రహం అలాగే లక్ష్మీదేవి కరుణ కటాక్షాలు ఎల్లప్పుడూ మనకు లభించవు అందుకే ధన త్రయోదశి రోజు పొరపాటున కూడా ఇనుప వస్తువులను ఇంటికి తెచ్చుకోకూడదు. ఇనుముతో పాటు కత్తి గుణపం వంటి పదునైన వస్తువులను కొనకూడదు అలాగే నూనె నెయ్యి వంటి వస్తువులను కూడా ధన త్రయోదశి రోజు కొనకూడదు. ముఖ్యమైన రోజున బంగారానికి బదులుగా వన్ గ్రామ్ గోల్డ్ నగల్ని, లేదంటే గిల్టీ నగల్ని కొనుక్కొని ఇంటికి తెచ్చుకోకూడదు ఇలా కొనడం ఆశుభానికి సంకేతం అని పండితులు చెబుతున్నారు.