Mega 157 : విజయదశమి పండుగ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, మల్లిడి వశిష్ఠ కాంబినేషన్‌లో భారీ చిత్రం ఘనంగా ప్రారంభమైంది. ఈ సినిమాలో హీరోయిన్‌ని మాటల మాంత్రీకుడు త్రివిక్రం ఫిక్స్ చేశారా..? అనే మాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అలా అనుకోవడానికి కారణం లేకపోలేదు. చిరంజీవి ఈ ఏజ్ లో కూడా వరుసగా సినిమాలు కమిటవుతూ జెట్ స్పీడ్ లో వాటిని పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. అయితే, ఆచార్య, బోళా శంకర్ ఘోర పరాజయాన్ని మూటకట్టుకోగా వాల్తేరు వీరయ్య మాత్రం మంచి కమర్షియల్ సక్సెస్ ని సాధించింది.
ఈ క్రమంలో చిరంజీవి తన కొత్త చిత్రాన్ని యూవి క్రియేషన్స్ వారి ఆఫీసులో ప్రారంభించారు. ఇక్కడ విశేషం ఏమిటంటే గతంలో సినిమాను సాంగ్ రికార్డింగ్ తో ప్రారంభించేవారు. ఇప్పుడు మెగా 157 ని కూడా అదే పద్ధతిలో ప్రారంభించారు. ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి చంద్రబోస్ సాహిత్యం సమకూర్చుకున్నారు. మొదటి పాట రికార్డింగ్ తో చిత్రాన్ని ప్రారంభించారు. బింబిసార చిత్రంతో భారీ హిట్ అందుకున్న వశిష్ఠ మెగాస్టార్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ అందుకుంటాడని మాత్రం ఊహించలేదు.
Mega 157 : సంయుక్త మీనన్ అయితే బావుంటుందని మేకర్స్ భావిస్తున్నారట.
అంతేకాదు, ఇప్పటి వరకూ ఏ దర్శకుడు చిరంజీవిని రెండవ సినిమాకే డైరెక్ట్ చేసే ఛాన్స్ అందుకోలేదు. మెగా 157 ఆయన కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం అని యూనిట్ తో పాటు మెగాస్టార్ చెబుతున్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక యూవీ క్రియేషన్స్ అంటే ప్రభాస్ సొంత సంస్థ. ప్రభాస్, రామ్ చరణ్‌ల మధ్య మంచి బాండింగ్ ఉంది. ఆ కారణంగానే మెగా 157 చిత్రానికి శ్రీకారం చుట్టారు.
ఇక ఈ సినిమాను ప్రకటించినప్పటి నుంచీ హీరోయిన్ ఎవరా..? అందరూ ఆరా తీస్తున్నారు. ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తున్న టాక్ ప్రకారం గురూజీ త్రివిక్రం శ్రీనివాస్ ఇప్పుడు బాగా ఎంకరేజ్ చేస్తున్న సంయుక్త మీనన్ అయితే బావుంటుందని మేకర్స్ భావిస్తున్నారట. సంయుక్త గనక అయితే, త్రివిక్రం అన్నీ చూసుకుంటారని చెప్పుకుంటున్నారు. బింబిసార, భీమ్లా నాయక్, విరూపాక్ష సినిమాలతో వరుస హిట్స్ అందుకొని క్రేజీ హీరోయిన్‌గా మారింది. అందుకే ఇప్పుడు మెగా 157 కోసం ఈ మలయాళ బ్యూటీని అనుకుంటున్నారట.