Thu. Jul 10th, 2025

    Tollywood: ఇటలీలో వరుణ్ లావణ్య సందడి చేస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మెగా ఫ్యామిలీలో త్వరలో పెళ్లి సందడి మొదలు కాబోతోంది. మెగా బ్రదర్ నాగబాబు కొడుకు టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ తేజ్ సొట్టబుగ్గల హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. తమ ప్రేమ విషయాన్ని గత కొంతకాలంగా ఇద్దరు గోప్యంగా ఉంచారు.

    ఇటీవలే ఇద్దరికీ ఎంగేజ్‌మెంట్ జరిగింది. అప్పటి నుంచి లావణ్య ఎక్కువగా అత్తగారింట్లోనే గడుపుతోంది. వినాయక చవితి, విజయదశమి పండుగలకి లావణ్య మెగా ఫ్యామిలీతో కలిసి సందడి చేసింది. అయితే, తాజాగా ఈ జంట ఇటలీలో దిగింది. పెదనాన్న చిరంజీవి ఇంట్లో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ ఇప్పటికే జరగగా త్వరలో ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్‌కి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

    tollywood-is-varun-lavanya-in-italy-without-marriage
    tollywood-is-varun-lavanya-in-italy-without-marriage

    Tollywood: వరుణ్, లావణ్య ఇటలీ వీధుల్లో షాపింగ్ 

    ఈ నేపథ్యంలోనే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇటలీకి చేరుకున్నట్టు సమాచారం. ఇంకా మెగా ఫ్యామిలీ వీరి పెళ్లి తేదిని అధికారికంగా ప్ర‌క‌టించ‌లేదు. కానీ, న‌వంబ‌ర్ 1వ తేదీన ఇట‌లీలో డెస్టినేష‌న్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం వరుణ్, లావణ్య ఇటలీ వీధుల్లో షాపింగ్ లు చేస్తున్నారు. పెళ్లికి అవ‌స‌ర‌మైన వాటిని స‌మ‌కూర్చుకునేందుకు ముందే వరుణ్, లావణ్య వెళ్లిన‌ట్లు తెలుస్తోంది. ఇప్పుడు దీనికి సంబంధించిన ఆ వీడియోనే యూట్యూబ్ లో వైర‌ల్ గా మారింది. ఇక ఇప్ప‌టికే పెళ్లికి సంబంధించిన వ‌స్త్రాలు అన్నింటిని మ‌నీష్ మ‌ల్హోత్రా స్టోర్ కొన్నారు.

    tollywood-is-varun-lavanya-in-italy-without-marriage
    tollywood-is-varun-lavanya-in-italy-without-marriage

    కాగా, వరుణ్ తేక్ కొత్త సినిమాలను చేస్తున్నారు. ‘ఆప‌రేష‌న్ వాలెంటైన్’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న మూవీ షూటింగ్ ఆల్రెడీ పూర్తిచేసాడు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. దీనితో పాటు ‘మ‌ట్కా’ అనే సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జ‌రుగుతోంది. పెళ్లి కారణంగా వరుణ్ తేజ్ కొన్నాళ్ళు ఈ మూవీకి బ్రేక్ ఇచ్చాడు. ఇక లావ‌ణ్య సినిమాలకి కాస్త దూరంగా ఉంది. మరి పెళ్లి తర్వాత సిల్వర్ స్క్రీన్ మీద కనిపిస్తుందా లేదా చూడాలి.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.