Manchu Manoj : గత సంవత్సరం టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ రెండవ పెళ్లికి రెడీ అవుతున్నాడంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఆ న్యూస్ చూసిన మనోజ్ ఆ అమ్మాయి ఎవరో నాకు చెప్పండి..అంటూ సెటైరీకల్‌గా కామెంట్స్ చేశారు. దాంతో అందరూ మనోజ్ రెండవ పెళ్లి చేసుకుంటాదనేది తప్పుడు ప్రచారం అని భావించారు. అయితే, మళ్ళీ ఇదే వార్త గత కొన్ని నెలలుగా అటు ఇండస్ట్రీ వర్గాలలో ఇటు అభిమానులలో చర్చనీయాంశంగా మారింది.

మంచు మనోజ్.. భూమా మౌనిక రెడ్డిని పెళ్లి చేసుకోబోతున్నాడని వ్బార్తలు అంతటా చక్కర్లు కొట్టాయి. ఎట్టకేలకి ఆ వార్తలు నిజమయ్యాయి. వీరి వివాహం మార్చి 3వ తేది 2023 రాత్రి హైదరాబాద్, ఫిల్మ్ నగర్ లోని మంచు వారి ఇంట ఈ వివాహం వైభవంగా జరిగింది. అత్యంత వైభవంగా జరిగింది. ఇరు కుటుంబాల నుంచి సన్నిహితులు అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు మనోజ్.. భూమా మౌనిక రెడ్డిల వివాహానికి హాజరు అయ్యారు. నవ దంపతులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు.


Manchu Manoj : మంచు విష్ణు కనిపించకపోవడం ఇప్పుడు అంతటా ఆసక్తికరమైన చర్చ..
ఇక తమ్ముడి పెళ్లి వేడుకలో అక్క మంచు లక్ష్మి అత్యంత ఆకర్షణగా నిలిచారు. మోహన్ బాబు, భూమా కుటుంబ నేపథ్యాలు పెద్దవి. ఈ రెండు కుటుంబాలకు చెందినవారు హాజరయ్యారు. మౌనిక రెడ్డి సోదరి మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ తన తల్లి స్థానంలో ఉండి ఈ వివాహాన్ని నిర్వహించారు. శాంత బయోటెక్ వరప్రసాద్ రెడ్డి అలాగే వైఎస్ విజయమ్మ ఈ పెళ్లికి హాజరు కావడం మరో విశేషం.

రెండు కుటుంబాల వారు అధికారికంగా విడుదల చేసిన ఫొటోల్లో మంచు విష్ణు.. ఆయన కుటుంబ సభ్యులు కనిపించకపోవడం ఇప్పుడు అంతటా ఆసక్తికరమైన చర్చగా మారింది. కాగా, అత్యంత ఘనంగా జరిగిన మంచు మనోజ్ – భూమా మౌనిక రెడ్డిల పెళ్లి వేడుకకి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం అన్నీ సోషల్ మీడియా వేదికలలో వైరల్ అవుతున్నాయి. మంచు వారి అభిమానులు అలాగే మీడియా వారు, సినీ పరిశ్రమలోని సెలబ్రెటీలు వీరి ఫొటోలను షేర్ చేస్తూ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.