Kota Bommali movie review: ప్రస్తుతం అటు ఏపీలో ఇటు తెలంగాణాలో ఎలక్షన్ హడావుడి ఉంది. ఈ టైమ్‌లో రావాల్సిన సినిమా కోట బొమ్మాళి. ఈ మూవ్‌మెంట్ లో ఎలాంటి కథ కావాలో అలాంటి కథతోనే వచ్చిన కోట బొమ్మాళి చిత్రం పోలింగ్‌కు సరిగ్గా వారం రోజుల ముందుగా థియేటర్స్‌లోకి వచ్చేసింది. ఇక ఇప్పటికే కోట బొమ్మాళి మూవీ నుంచి విడుదలైన ట్రైలర్, టీజర్ బాగానే సినిమాపై అంచనాలు పెంచాయి. అంతగా ఆసక్తి రేపిన ఈ చిత్రం ఎలా వుంది. ఇప్పుడు మన రివ్యూ లో తెలుసుకుందాం.
ఈ సినిమాలో ఉన్న లింగిడి లింగిడి పాటతో క్రేజ్ తెచ్చుకున్న కోట బొమ్మాళి.. ఇప్పుడు కంటెంట్ వల్ల బాగా మాట్లాడుకుంటున్నారు. టీజర్, ట్రైలర్ విడుదలైన తర్వాత కోట బొమ్మాళి పిఎస్‌పై మూవీ మీద భారీగా అంచనాలు పెరిగాయి. ముఖ్యంగా పొలిటికల్ సీజన్ కాబట్టి ఈ టైమ్‌లో పక్కాగా అటువన్టి కథతోనే సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.
Kota Bommali movie review : మళ్ళీ ఇంతకాలాని అలాంటి పాత్రే
మలయాళ రీమేక్ అయినప్పటికీ.. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు చాలా మార్పులు చేర్పులు చేశారు. పొలిటికల్ లీడర్స్ చేసే ఒత్తిడి వల్ల పోలీసులు ఎలా నలిగిపోతున్నారనేదే కోట బొమ్మాళి చిత్ర కథా నేపథ్యం. శ్రీకాంత్ తన కెరీర్ బెస్ట్ ఇవ్వడానికి చాలా బాగా ట్రే చేసారు. గతంలో వచ్చిన ఖడ్గం సినిమాలో శ్రీకాంత్ నటన అందరినీ ఆకట్టుకొని ప్రశంసలు అందుకున్నారు. మళ్ళీ ఇంతకాలాని అలాంటి పాత్రే మళ్ళీ దక్కింది.
ఇక ఈ సినిమా కోటబొమ్మాలి పిఎస్ లో జరిగే ఒక సంఘటనతో మొదలవుతుంది అక్కడ సిన్సియర్గా డ్యూటీ చేసే వెంకటరమణ పొలిటిషన్ కి తలనొప్పిగా మారుతాడు, మరి ఆ వెంకటరమణ తన కానిస్టేబుల్స్ ఇద్దరు చేసిన ఒక చిన్న పని వలన వాళ్ళు చిక్కుల్లో పడతారు. ఈ సినిమాలో ఎక్కువ భాగం ఈ ముగ్గురిని పట్టుకోవడానికి ప్రయత్నించడమే ఉంటుంది ..! ఈ దశలో పోలీస్ ఫ్యామిలీస్ ఎలా ఉంటున్నాయి , వీళ్ళ మంసాయిక స్థితి ఏంటి ..?! అనే అంశాల చుట్టూ సినిమా ఉంటుంది .
ఇక ఈ సినిమా కథ చాలా వరకు ట్రావెల్ లో సాగుతుంది. ఇందులో కొన్ని సీన్లు రిపీట్ అయినట్టు ఉన్నాయి. కానీ కథ ఆకట్టుకుంటే మాత్రం బగానే ఆదరిస్తారు. ఇక కోట బొమ్మాళి మూవీలో నిర్మాణ విలువలు చాలా బావున్నాయి. నేపధ్య సంగీతం మాత్రం కాస్త ఆకట్టుకునేలా అనిపించదు. ద్వితీయార్థంలో ఎమోషన్ సీన్స్ బాగానే ఉన్నాయి. పోలీసులు పారిపోయాక వాళ్ళని పట్టుకునే డ్రామా ఆసక్తిగా సాగుతుంది.
డిఫరెంట్ సినిమాలు ఇస్టపడేవారికి కోట బొమ్మాళి ఖచ్చితంగా నచ్చుతుంది.