Mon. Jul 14th, 2025

    Brahma Kamalam: సాధారణంగా మన ఇంటి ఆవరణంలోఎన్నో రకాల మొక్కలను పెంచుతూ ఉంటాము. ఇక చాలామంది దైవ సమానమైనటువంటి మొక్కలను పెంచుతూ ఉంటారు. ఇంటి ఆవరణంలో తులసి చెట్టుతో పాటు బిల్వపత్రి, పారిజాతం వంటి వృక్షాలను పెంచుతారు. ఇక చాలా మంది బ్రహ్మ కమలం చెట్టును కూడా ఇంటి ఆవరణంలో పెంచుకొని పూజిస్తూ ఉంటారు. ఇలా బ్రహ్మకమలం ఇంటి ఆవరణంలో పూజించడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి, ఇక బ్రహ్మ కమలం వికసించడం దేనికి సంకేతం అనే విషయానికి వస్తే…

    if-brahma-lotus-blossoms-in-you-brahma-kamala-r-house-do-you-know-what-it-is-a-sign-of
    if-brahma-lotus-blossoms-in-you-brahma-kamala-r-house-do-you-know-what-it-is-a-sign-of

    సాధారణంగా బ్రహ్మ కమలం పుష్పాలు ఆగస్టు నుంచి సెప్టెంబర్ మధ్యకాలంలో వికసిస్తాయి. బ్రహ్మ కమలం చెట్టు సాక్షాత్తు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పుష్పంగా భావిస్తారు కనుక ఈ పుష్పాన్ని లక్ష్మీదేవికి సమర్పించడం వల్ల ఏ విధమైనటువంటి ఆటంకాలు ఉండవని, సకల సంపదలు కలుగుతాయని అర్థం. ఇలా బ్రహ్మ కమలం వికసించిన తర్వాత ముందుగా బ్రహ్మ కమలం చెట్టుకు పూజ చేసే కొబ్బరికాయ కొట్టిన అనంతరమే ఈ పుష్పాన్ని కోయాలి. కోసిన ఈ పుష్పంతో అమ్మవారికి పూజ చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం మన పైన ఉంటుంది.

    ఇక బ్రహ్మ కమలం ఇప్పుడు కూడా రాత్రిపూట మాత్రమే వికసిస్తుంది. ఇక ఈ పుష్పాలతో పెళ్లి కాని వారు అమ్మవారికి పూజ చేయడం వల్ల తొందరగా పెళ్లి జరుగుతుందని పండితులు తెలియజేస్తున్నారు. ఇలా బ్రహ్మ కమలం పుష్పం అమ్మవారికి పూజ చేయడం వల్ల సకల సంపదలు కలుగుతాయి. ఇక మన ఇంట్లో ఎక్కువగా ఈ పుష్పాలు కనక వికసిస్తే వాటిని ఇతరులకు ఇవ్వటం కూడా శుభ సంకేతం. ఇలాంటి ఎంతో విశిష్టమైనటువంటి బ్రహ్మ కమలం మన ఇంట్లో ఉండటం ఎంతో మంచిది.