Karthika Masam: హిందువులకు ప్రతి ఒక్క మాసం కూడా ఎంతో పవిత్రమైన మాసంగా భావిస్తారు. ఈ క్రమంలోనే తెలుగు మాసాలలో వచ్చే కార్తీకమాసానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. కార్తీకమాసం శివకేశవలకు ఎంతో ప్రీతికరమైన మాసం. మరి త్వరలోనే ప్రారంభం కానున్న ఈ మాసంలో మనం ఎన్నో రకాల నియమనిష్ఠలను పాటించడం వల్ల శివ కేశవుల అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉంటుంది. మరి కార్తీక మాసంలో పాటించాల్సిన నియమాలు ఏంటి తినాల్సిన తినకూడని ఆహార పదార్థాలు ఏంటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం…
![Karthika Masam: కార్తీక మాసంలో పాటించాల్సిన నియమాలు... తినకూడని ఆహార పదార్థాలు ఇవే? kartik-masam-rules-for-food-know-what-to-eat-and-what-not-to-eat](http://natelugu.com/wp-content/uploads/2023/10/Collage-Maker-28-Oct-2023-12-44-PM-3663.jpg)
కార్తీకమాసం శ్రీమహావిష్ణుమూర్తికి ఎంత ప్రీతికరమైనది కనుక ఈ మాసంలో ప్రతిరోజు సాయంత్రం తులసి చెట్టుకు దీపారాధన చేయటం వల్ల ఆ మహావిష్ణువు లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉండి ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా కాపాడుతారు. ఇక ఈ మాసంలో చాలా నియమనిష్టలతో ఉండాలి. ప్రతిరోజు ఉదయం, సంధ్య సమయంలో దీపాలు వెలిగించడం వల్ల ఏ విధమైనటువంటి దోషాలు, దుష్ట శక్తుల ప్రభావం మనపై ఉండదు.
ఇక కార్తీకమాసంలో చాలామంది ఉపవాసాలు ఉంటారు ఇలా ఉపవాసం ఉండి దానధర్మాలు చేయడం వల్ల అమ్మవారి కరుణ కటాక్షాలు ఎల్లవేళలా మనపై ఉంటాయి. ఈ జన్మలో భక్తులు నేలపై శయనించి, బ్రహ్మచర్యాన్ని ఆచరించి, దీపదానం చేయడం, తులసి చెట్టును పూజించడం ద్వారా మోక్షాన్ని పొందవచ్చని పురాణాల పేర్కొన్నాయి. కార్తీక మాసంలో ఉల్లిపాయ, వెల్లుల్లి, బెండకాయ, పొట్లకాయ, కాకర కాయను అస్సలు తినకూడదు. అలాగే, ఈ పవిత్ర మాసంలో ఎక్కువ విత్తనాలు ఉన్న పండ్లను తినవద్దు. అంతే కాదు ఈ మాసంలో బెల్లం తినడం ఎంతో మంచిది. ఇక కార్తీకమాసంలో పొరపాటున కూడా మాంసాహార పదార్థాలను ముట్టుకోకూడదు. ఇక ఈ మాసంలో మన స్తోమతకు తగ్గట్టుగా పేదలకు దానధర్మాలు చేయడం వల్ల మోక్షం కలుగుతుంది.