Kantara2 : కాంతార సినిమాతో ప్రపంచం మొత్తం కన్నడ పరిశ్రమవైపు చూసేలా చేశాడు నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి.ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వచ్చిన ‘కేజీఎఫ్’తర్వాత కన్నడ సినిమా ఖ్యాతిని విపరీతంగా పెంచేసింది ఈ సినిమా. విమర్శకుల నుంచి ప్రశంసలను అందుకుని అతి తక్కువ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేసే సెన్సేషనల్ హిట్ ను అందుకుంది. రిషబ్ నటన, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, సంగీతం ఒక్కటేమిటి అన్ని ఎలిమెంట్స్ లో కాంతారా వావ్ అనిపించింది.
కాంతార సూపర్ హిట్ తో రిషబ్ దాని ప్రీక్వెల్ గా రానున్న “కాంతార-ఏ లెజెండ్ చాప్టర్ 1” ను అదే లెవెల్ లో తీసేందుకు తన ప్రయత్నాలు తాను చేస్తున్నాడు. ఈ క్రమంలో సినిమా గురించి వస్తున్న ఒక్కో న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ మధ్యనే కాంతార ప్రీక్వెల్ నుంచి విడుదలైన రిషబ్ లుక్ ఇంటర్నెట్ లో వైరల్ అయ్యింది. ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా రిషబ్ శెట్టి తన లుక్ తో ఆశ్చర్యపరిచాడు. తాజాగా ఈ మూవీ నుంచి మరో అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ నటిస్తున్నారన్న న్యూస్ ఇప్పుడు నెట్టింట్లో షికారు చేస్తోంది.
‘కాంతార’కు ముందు జరిగిన కథ నేపథ్యంలో రిషబ కాంతార ప్రీక్వెల్ తీస్తున్నాడు. ఫస్ట్ పార్ట్ కు వచ్చిన రెస్పాన్స్ ను దృష్టిలో పెట్టుకుని అత్యంత ప్రెస్టీజియస్ ప్రాజెక్టుగా రిషబ్‌శెట్టి దీనిని తెరకెక్కించనున్నాడు. ఈ మూవీలో కొంత మంది స్టార్ హీరోలు కూడా భాగం కానున్నట్టు సమాచారం. అయితే వీరిలో బలంగా వినిపిస్తున్న పేరు మలయాళం ఇండస్ట్రీ సూపర్ స్టార్ మోహన్‌లాల్. ఈ మధ్యనే రిషబ్ మోహన్‌లాల్‌ని కలిశారు. ఆ ఫొటో కూడా షోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో‘కాంతార 2’లో మోహన్‌లాల్ నటిస్తున్నారన్న న్యూస్ కు బలం చేకూరినట్టయ్యింది. మోహన్ లాల్ తో పాటు మరికొంత మంది స్టార్ హీరోలు కూడా కాంతార ప్రీక్వెల్ లో భాగం అవుతారని సమాచారం. ‘కాంతార’కు ముందు జరిగిన కథ కావడంతో , స్టోరీ డిమాండ్ మేరకు గుర్రపు స్వారీతో పాటు యుద్ధవిద్యలోనూ శిక్షణ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. తన సొంతూర్లోనే భారీ సెట్ వేసి, నాలుగు షెడ్యూల్స్‌లో ఈ సినిమాను షూట్ చేస్తారని సమాచారం. ఈ మధ్యనే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ఫైనల్ కు వచ్చాయి.