Prabhas : యంగ్ రెబల్ స్టార్ డార్లింగ్ ప్రభాస్ నటించిన సలార్ మూవీ బాక్సీఫీస్ ను ఏ విధంగా దున్నేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఫ్యాక్టరీ నుంచి వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను రాబట్టింది. అప్పటి వరకు వరుస ఫ్లాపులతో అప్సెట్ అయిన ప్రభాస్ సలార్ తో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. సలార్ మూవీ ఏకంగా రూ.700 కోట్లకుపైగా కలెక్షన్లను రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఫస్ట్ పార్ట్ సూపర్ హిట్ కావడంతో ఫ్యాన్స్ సెకెండ్ పార్ట్ రిలీజ్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. రెండో భాగం షూటింగ్ కూడా శరవేగంగా జరుపుతున్నారు. అతి త్వరలోనే విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. థియేటర్లలో భారీ విజయాన్ని అందుకున్న సలార్ ఓటీటీలోనూ దుమ్ముదులిపేసింది. లేటెస్టుగా బుల్లితెరపై కూడా సందడి చేసేందుకు రెడీ అయ్యింది. ఏప్రిల్ 21న స్టార్ మాలో సాయంత్రం 5.30 గంటలకు సినిమా టెలికాస్ట్ కానుంది. ఈ క్రమంలో మూవీ మేకర్స్ ప్రభాస్ ఫ్యాన్స్ కోసం ఓ బంపరాఫర్‌ను అనౌన్స్ చేశారు.
సలార్ మూవీలో ప్రభాస్ డ్రైవ్ చేసిన బైక్‌ను సొంతం చేసుకునే ఛాన్స్ ను ఫ్యాన్స్ కు అందించింది హోంబలే ఫిల్మ్స్. అఫీషియల్ గా ఈ విషయమై ప్రకటించింది. ఒక ఒక్క ఎస్‌ఎమ్‌ఎస్ తో బైక్‌ను సొంతం చేసుకునే ఛాన్స్ ఇచ్చింది. బైక్‌ను ఎలా సొంతం చేసుకోవాలి అనే విషయాన్ని వివరిస్తూ ఓ ట్వీట్ కూడా పోస్ట్ చేసింది సంస్థ.
స్టార్ మాలో ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు సినిమా టెలికాస్ట్ కానుంది. ఆ సమయంలో స్క్రీన్ కి ఒకవైపు బైకు కనిపిస్తూ ఉంటుంది. సినిమా పూర్తయ్యేలోపు ఆ బైక్ స్క్రీన్ మీద ఎన్నిసార్లు కనిపించిందో కరెక్ట్ గా చెబితే బైక్‌ను సొంతం చేసుకోవచ్చని తెలిపింది. మూవీ టెలికాస్ట్ పూర్తి కాగానే వెంటనే ఎస్‌ఎమ్‌ఎస్ లైన్లు స్టార్ట్ అవుతాయి. ఆ వెంటనే 9222211199 నంబర్‌కు SALAAR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి బైక్ ఎన్నిసార్లు కనిపించిందో ఆ కౌంట్ నెంబర్‌ను ఎంటర్ చేసి పంపించాలి. అంతే అని వివరించింది. అంటే ప్రేక్షకులు ఎస్‌ఎమ్‌ఎస్ లను ఏప్రిల్ 21 రాత్రి 8 గంటల నుంచి సెండ్ చేయాల్సి ఉంటుంది. మీరే కనుక లక్కీ అయితే ప్రభాస్ బైక్‌ను సొంతం చేసుకోవచ్చు.