Sun. Jun 21st, 2026

    International Yoga Day 2026: ప్రతి ఏడాది జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవం గా జరుపుకుంటారు. ఇక మన జీవనశైలిలో జీవన విధానంలో యోగాకు ఎంతో ప్రాధాన్యత ఉంది. మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవడం కోసం యోగ కీలకంగా మారుతుందని విషయం తెలిసిందే. ప్రతిరోజు కొంత సమయం పాటు యోగా చేయడం వల్ల మానసిక ప్రశాంతత కలగడమే కాకుండా శారీరకంగా కూడా ఎంతో దృఢంగా ఆరోగ్యంగా ఉంటారు. మరి యోగ చేయడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి అనే విషయానికి వస్తే..

     

    సాధారణంగా వయసు పైబడిన వారిలో మోకాళ్ల నొప్పులు కీళ్ల నొప్పులు రావడం సర్వసాధారణం కానీ ఇటీవల కాలంలో 30 సంవత్సరాలు దాటిన యువత కూడా ఈ విధమైనటువంటి సమస్యతో బాధపడుతున్నారు. ఇలా నొప్పులు రావడానికి ప్రధాన కారణం మన శరీరంలో కదలికలు లేకపోవడమేనని నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజు కొంత సమయం పాటు యోగా చేయడం వల్ల మన శరీరంలో కదలికలు జరిగి ఫ్లెక్సిబిలిటీ పెరిగి కండరాలు బలంగా మారి కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు. యోగాలో భాగమైన ప్రాణాయామం, శ్వాసక్రియ వ్యాయామాలు చేయడం వల్ల మన శరీర భాగాలకు సక్రమంగా ఆక్సిజన్ అంది, గుండె పనితీరును పెంచడమే కాకుండా గుండె జబ్బులు రాకుండా ఆపుతుంది.

    International yoga day health benefits of yoga in our lives
    International yoga day health benefits of yoga in our lives

    International Yoga Day 2026: మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం..

    మన శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గినప్పుడు ఎన్నో రోగాల బారిన పడాల్సి ఉంటుంది. చిన్న చిన్న ఇన్ఫెక్షన్లు కూడా ప్రమాదాలకు కారణం అవుతుంటాయి. అయితే మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించుకునే విషయంలో యోగ కీలకపాత్ర పోషిస్తుంది. ప్రతిరోజు యోగా చేయటం వల్ల జీవక్రియలు మెరుగుపడతాయి. మన శరీరంలోని అవయవాలు శుభ్రమై జీవక్రియను పెంపొందించడంలో దోహదం చేస్తాయి. ఇలా రోగ నిరోధక శక్తి పెరగడానికి యోగ కీలకపాత్ర పోషిస్తుంది. ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ కాలంతోపాటు పరుగులు పెడుతున్నారు. తద్వారా మానసిక ప్రశాంతతకు దూరమవుతున్నారు. మానసిక ప్రశాంతత లేకపోవడం ఒంటరిగా ఫీల్ అవ్వటం, నిద్రలేమి లాంటి సమస్యలతో బాధపడుతున్న వారు యోగా చేయటం వల్ల ఈ సమస్యల నుంచి బయటపడి మానసిక ప్రశాంతతను పొందుతారు. ఇలా యోగ కారణంగా మన శరీరానికి ఆరోగ్యానికి కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.