Lipstick: సాధారణంగా మనం అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరు కూడా అమ్మాయిలు పెద్ద ఎత్తున లిప్ స్టిక్ వేసుకొని మేకప్ అవుతూ ఉంటారు. ఇలా లిప్ స్టిక్ ఎంతో అందాన్ని కూడా తీసుకువస్తుంది ఇలా అందాన్ని రెట్టింపు చేసుకోవడం కోసం మనం వివిధ రంగులు ఉన్నటువంటి లిప్ స్టిక్ తరచూ వాడటం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. లిప్ స్టిక్ ఉపయోగించడం వల్ల వచ్చే అనర్థాలు ఏంటి అనే విషయానికి వస్తే…
లిప్‌స్టిక్‌లో లేట్ న్యూరోటాక్సిన్‌లు ఉంటాయి. ఇవి పెదవులకు మంచిదికాదు. ఇందులో మాంగనీస్, లెడ్ కాడ్మియం వంటి రసాయన సమ్మేళనాలు ఉపయోగించి తయారు చేస్తారు. ఇవి మీ పెదాలకు హాని కలిగిస్తాయి. లిప్‌స్టిక్‌ను ఎక్కువగా ఉపయోగించడం వల్ల మీ పెదవులు నల్లగా మారే ప్రమాదం కూడా ఉంది. లిప్‌స్టిక్‌లలో కొన్ని హానికరమైన రసాయనాలు పాదరసం, సీసం, కాడ్మియం వంటివి మన ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. ఈ రసాయనాల వల్ల మనకు అనేక రకాల వ్యాధులు వస్తాయి.
ఇక ఇలాంటి వాటిని ఉపయోగించడం వల్ల పెదవులకు మాత్రమే కాకుండా మూత్రపిండాలపై, పొట్ట పై కూడా తీవ్రస్థాయిలో ఎఫెక్ట్ పడుతుందని నిపుణులు చెబుతున్నారు.చాలా లిప్‌స్టిక్‌లలో క్యాన్సర్‌కు కారణమయ్యే పదార్థాలు ఉంటాయి. అదనంగా, లిప్‌స్టిక్‌ను ఎక్కువ కాలం తాజాగా ఉంచడానికి ఉపయోగించే కొన్ని రసాయనాలు దగ్గు, కంటి చికాకు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగచేస్తాయి. ఇక గర్భిణీ స్త్రీలు పొరపాటున కూడా లిప్ స్టిక్ వాడకపోవడం మంచిది లేదంటే గర్భంలో ఉన్న శిశువుపై కూడా ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి.