Mon. Jul 14th, 2025

    Garlic: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతూ ఉన్నారు. చిన్న పిల్లల నుంచి మొదలుకొని పెద్దవారు వరకు ఈ సమస్య వెంటాడుతూనే ఉంది. ఇలా గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్న వారు ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడం కోసం ప్రతి రోజు ఉదయం టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు ఇలా టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల మరికొన్ని అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అందుకే సహజసిద్ధంగా ఈ గ్యాస్ట్రిక్ సమస్య నుంచి బయటపడటం కోసం ఈ సింపుల్ చిట్కా పాటిస్తే చాలు.

    మన వంటింట్లో వెల్లుల్లి తప్పనిసరిగా ఉంటుంది అయితే వెల్లుల్లిలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయనే సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఎవరైతే గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారో అలాంటివారు పరగడుపున వెల్లుల్లిని తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ అనే పదార్థం మనల్ని ఎన్నో రోగాల ముప్పు నుంచి రక్షిస్తుంది.

    వెల్లుల్లిలో ఫాస్పరస్, జింక్, పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజూ ఉదయాన్నే నమలడం అలవాటు చేసుకుంటే.. జీర్ణవ్యవస్థకు సంబంధించిన అనేక సమస్యలను దూరం చేస్తుంది.పచ్చి వెల్లుల్లి తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇది గ్యాస్, ఉబ్బరం, జీర్ణ సమస్యల నుండి ఉపశమనం పొందడం ద్వారా ప్రేగుల కదలికను సులభతరం చేస్తుంది. వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి కడుపులోని చెడు బ్యాక్టీరియాను బయటకు పంపించడంలో దోహదం చేస్తుంది. వెల్లుల్లిలో విటమిన్ సి, విటమిన్ b6, సెలీనియం, మాంగనీస్ అధికంగా ఉంటాయి. ఇవన్నీ కూడా రోగనిరోధక వ్యవస్థను బలంగా మార్చడంతో రోగాల బారిన పడకుండా ఉంటాము.