Fri. Nov 14th, 2025

    Hi Nanna First Review: ‘హయ్ నాన్న’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. ప్రేక్షకులు గనక ఈ సినిమాను కరెక్ట్ గా రిసీవ్ చేసుకుంటే ఖచ్చితంగా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంటుంది. నేచురల్ స్టార్ నాని, ‘సీతారామం’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించిన ‘హాయ్ నాన్న’ ఈ డిసెంబర్ 7న భారీ స్థాయిలో విడుదల కాబోతుంది.

    ఈ నేపథ్యంలో మేకర్స్ బాగానే ప్రమోషన్స్ చేస్తూ సినిమా ప్రేక్షకులకి చేరువ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇక ‘హాయ్ నాన్న’ సినిమా టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కిందట. ఇందులో నాని తన కూతురు భవిష్యత్తు నుండి గతంలోకి వస్తే ఎలా ఉంటుంది..అన్న పాయింట్ తో ఆసక్తికరంగా రూపొందించారట. ఇప్పటికే, ఓసారి హైదరాబాద్ లో ప్రివ్యూ షో చూసిన సినిమా జర్నలిస్టులు కొందరు ప్రేక్షకుల నుంచి ‘హాయ్ నాన్న’ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

    hi-nanna-first-review- Nani will never do such an emotional movie again in his career..
    hi-nanna-first-review- Nani will never do such an emotional movie again in his career..

    Hi Nanna First Review: ‘హాయ్ నాన్న’ కూడా అదే మ్యాజిక్ ని రిపీట్

    ముఖ్యంగా నాని, మృణల్ మధ్య లవ్ సీన్స్, అలాగే, నాని-పాప కియారాల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ బాగా కనెక్ట్ అవుతాయని అభిప్రాయపడుతున్నారు. ఇక ‘ఖుషి’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సంగీత దర్శకుడు హేషం అబ్దుల్ వాహబ్ అందించిన సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగా ప్లస్ అని అంటున్నారు. ఒకప్పుడు హిందీలో వచ్చి బ్లాక్ బస్టర్ సాధించిన ‘కుచ్ కుచ్ హోతాహై’ సినిమా ఫ్లేవర్ కనిపిస్తుందని అంటున్నారు. నాని గత చిత్రం ‘దసరా’ మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు రాబోతున్న ‘హాయ్ నాన్న’ కూడా అదే మ్యాజిక్ ని రిపీట్ చేస్తుందని ఎంతో ధీమాగా ఉన్నారు.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.