Beauty Tips: చలికాలం మొదలైంది అంటే మన శరీరం డిహైడ్రేషన్ అవుతుందనే సంగతి మనకు తెలిసిందే. ఇలా చర్మం డిహైడ్రేషన్ అవ్వడం వల్ల పగుళ్లు ఏర్పడతాయి ముఖ్యంగా చాలామంది చలికాలంలో పాదాల పగుళ్ల సమస్యతో బాధపడుతుంటారు. ఈ సమస్య కారణంగా అడుగు తీసే అడుగు వేయాలంటే కూడా ఎంతో ఇబ్బంది పడుతుంటారు. ఇలా పాదాల నొప్పి సమస్యతో అలాగే పాదాల పగుళ్లు సమస్యతో బాధపడేవారు ఎన్నో రకాల క్రీమ్స్ వాడిన కూడా ఏ విధమైనటువంటి ప్రయోజనం ఉండదు.
ఇలా పాదాల పగులు సమస్యతో బాధపడేవారు ఇంట్లోనే మనం రోజు ఉపయోగించే టూత్ పేస్ట్ సహాయంతో పాదాల పగుల సమస్య నుంచి కూడా బయటపడవచ్చు. మరి పాదాల పగుళ్లకు టూత్ పేస్ట్ ద్వారా ఎలా ఉపశమనం పొందవచ్చు అనే విషయానికి వస్తే ముందుగా ఒక గిన్నెలోకి రెండు టేబుల్ స్పూన్ల వైట్ టూత్ పేస్ట్ అలాగే రెండు టేబుల్ టీ స్పూన్ల ఆలివ్ ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసి బాగా ఆ మిశ్రమాన్ని కలపాలి.
ఇలా మిశ్రమాన్ని కలిపి తయారు చేసుకున్న తర్వాత గోరువెచ్చని నీటితో మన పాదాలను బాగా శుభ్రం చేసుకోవాలి ఇలా శుభ్రం చేసుకున్నటువంటి పాదాలను తడి ఆరేలా గుడ్డతో శుభ్రం చేసుకుని అనంతరం మనం తయారు చేసుకున్నటువంటి ఈ టూత్ పేస్ట్ మిశ్రమాన్ని పాదాల పగుళ్ల పై రాసి బాగా మసాజ్ చేయాలి. ఇలా ఐదు నిమిషాల పాటు మసాజ్ చేసిన తర్వాత ఆ పేస్టు మొత్తం డ్రై అయ్యేవరకు ఉండే అనంతరం గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి. ఇలా క్రమం తప్పకుండా రెండు మూడు వారాల పాటు చేయడం వల్ల పాదాల పగుళ్లు సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.