Vastu Tips: ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో సుఖ సంతోషాలతోను అలాగే ఆనందంగా ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఉండాలని భావిస్తూ ఉంటారు. ఇలా ఇంట్లో సుఖసంతోషాలు కలగాలి అంటే వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని పరిహాలను పాటించడం వల్ల ఎవరి చెడు దృష్టి మన ఇంటి పై పడదు. అలాగే ఇంటిల్లిపాది ఎంతో సంతోషంగా ఆరోగ్యంగా ఉంటారు. మరి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఏర్పడి కుటుంబం మొత్తం సంతోషంగా ఉండాలి అంటే ఏం చేయాలి అనే విషయానికి వస్తే…

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిల్లిపాది సంతోషంగా ఉండాలి అంటే ఇంటి ప్రధాన ద్వారం ఎంతో అందంగా అలంకరించి ఉండాలి అలాగే మన ఇంట్లో ఒక ఇత్తడి గిన్నెలో నీటిని పోసి రకరకాల పువ్వులను ఎంతో అందంగా అలంకరించి ఉత్తర దిశ వైపు లేదా ఈశాన్యం ఆగ్నేయ దిశ వైపు అలంకరించి పెట్టడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. మన ఇంట్లోకి వచ్చిన వారి దృష్టి దీనిపై పడేలా చూడాలి అప్పుడే మన ఇంటిపై ఏ విధమైనటువంటి చెడు ప్రభావం ఉండదని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
ఇంటి ప్రధాన ద్వారం ఇరువైపులా కూడా ఎంతో ఆహ్లాదకరమైనటువంటి మొక్కలను అలంకరించి పెట్టాలి ఇలా ఇంటి ప్రధాన ద్వారం అందంగా ఉండటం వల్ల ఆ ఇంట్లో ఏ విధమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉండదని ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్లి పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. ఇక ఇంటిలో నీటిని పోసి అలంకరించే గిన్ని మాత్రం ఎప్పుడూ కూడా ఇనుము వెండిని వాడకూడదు. వాడటం వల్ల నెగటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది.