Hema : బెంగళూరు రేవ్ పార్టీ టాలీవుడ్ ఇండస్ట్రీలో కలకలం రేపింది. సీనియర్ నటి హేమ సహా 80 మంది ఈ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. పార్టీకి వచ్చిన వారి నుంచి రక్త నమూనాలను సేకరించిన పోలీసులు వారు డ్రగ్స్ తీసుకున్నట్లు పరీక్షల ద్వారా నిర్ధారించారు. ఈ కేసులో భాగంగా అందరికీ నోటీసులు పంపించారు. నటి హేమకి కూడా నోటీసులు పంపించారు. అయితే తన హెల్త్ బాగోలేదని, విచారణకు రాలేనని హేమ చెప్పింది. రెండోసారి కూడా పోలీసులు నోటీసులు పంపించారు. అయినప్పటికీ హేమ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో బెంగళూరు పోలీసులు హైదరాబాద్ వచ్చి హేమను అదుపులోకి తీసుకున్నారు. హాస్పిటల్ లో వైద్య పరీక్షలు చేసి మరీ ఆమెను బెంగళూరు తీసుకెళ్లారు.
ఇదిలా ఉంటే ఈ కేసుతో తనకు సంబంధం లేదంటూ హేమ మొదటి నుంచి చెబుతూవస్తోంది. రేవ్ పార్టీలో అడ్డంగా బుక్ అయినా సరే తన తప్పేంలేదంటూ బుకాయించింది. అంతే కాదు తాను హైదరాబాదులో ఉన్నానంటూ ఒక ఫేక్ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేసి వివాదానికి దారితీసింది. అయితే బెంగళూరు పోలీసులు హేమను అదుపులోకి తీసుకున్నప్పుడు ఆమె తన పేరును కృష్ణవేణిగా చెప్పుకొచ్చింది. అసలు ఆమె ఆ పార్టీకే వెళ్లలేదని కలరింగ్ ఇచ్చేందుకు ప్రయత్నించింది. అయితే పోలీసులు ఈ విషయాన్ని పసిగట్టి ఆమెను డ్రగ్స్ కేసులో అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ కేసుతో పాటు పోలీసులను తప్పు దోవ పట్టిస్తుందని మరో కేసు కూడా ఫైల్ చేశారు. ఇక ప్రజెంట్ కోర్టు హేమకు రెండు వారాల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.
ఇదిలా ఉంటే డ్రగ్స్ వివాదంలో హేమపై కేసు నమోదు కావడంతో ఆమెను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేయాలని మా మీద ఒత్తిడి పెరుగుతోంది. ఈ క్రమంలో మా అధ్యక్షుడు మంచు విష్ణు ఆమెను అసోసియేషన్ లో ఉంచాలా లేక సస్పెండ్ చేయాలా అని తన వాట్సాప్ గ్రూప్ లో ఒక పోల్ పెట్టినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ పోలింగ్ లో ఎక్కువ మంది ఆమెను సస్పెండ్ చేయాలని సూచించారు. దీంతో ఈ విషయం మీద ఎలాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు కానీ రేపు అధికారికంగా ఆమెను సస్పెండ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.