Anupama Parameswaran : టాలీవుడ్లో ప్రస్తుతం మలయాళ ముద్దుగుమ్మ అనుపమా పరమేశ్వరన్ క్రేజ్ నడుస్తోంది. రీసెంట్ గా ఈ బ్యూటీ సిద్ధు జొన్నలగడ్డతో కలిసి చేసిన టిల్లు స్క్వేర్ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. యూత్ కు బాగా కనెక్ట్ అయిన ఈ మూవీ ఏకంగా వంద కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. ఈ మూవీలో అనుపమ లిల్లీ క్యారెక్టర్ ఇరగదీసింది. కాస్త బోల్డ్ గా కనిపించినా, ఆమె నటనకు అందరూ ఫిదా అయిపోయారు. ఇప్పటి వరకు సంప్రదాయంగా కనిపించిన అనుపమ ఈ మూవీలో మాత్రం గ్లామర్ డోస్ ను ఓ రేంజ్ లో పెంచేసింది. తనలోని కొత్త ట్యాలెంట్ ను ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఇదిలా ఉంటే ఈ భామకు ఆన్ స్క్రీన్ లోనే కాదు సోషల్ మీడియాలోనూ మంచి ఫాలోయింది ఉంది. అనుపమ కూడా నెట్టింట్లో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తన లేటెస్ట్ ఫోటోలను ఒదులుతూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. లేటెస్టుగా అనుపమ ఓ ఫోటోను షేర్ చేసింది. ఆ ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతోంది. దానికి కారణంగా ఆ ఫోటో కింద అనుపమ చేసిన కామెంట్.
అనుపమ షేర్ చేసిన ఫోటో ఇన్స్టా లో వైరల్ అవుతోంది. పాపం అనుపమ చాలా కాలంగా నడుమునొప్పితో బాధపడ్తుతోందట. ఆ నొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు ఇలాంటి మసాజ్ కావాలంటూ ఒక ఫోటోను నెటిజన్లతో పంచుకుంది. ఇంతకీ ఆ ఫోటోలో ఏముందంటే..ఆ ఫోటోలో ఒక వ్యక్తి షర్ట్ తీసేసి టవల్ మీద పడుకున్నాడు. అతనిపైకి ఓ రోడ్ రోలర్ ఎక్కినట్టుగా ఫోటోలో ఉంది. ఆ ఫోటోను షేర్ చేసి అలాంటి మాసాజ్ కావాలంటూ కామెంట్ చేసింది అనుపమ. దాంతో ఆమె చేసిన ఈ పోస్ట్ కాస్త వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్స్ ఊరుకుంటారా ఆ ఫోటోపై ఫన్నీగా కామెంటుతున్నారు.
ఇక టిల్లు స్క్వైర్ తరువాత అనుపమ వరుసగా నాలుగు సినిమాలను లైన్లో పెట్టింది. త్వరలో ఆమె పరదా అనే లేడీ ఓరియెంటెడ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా సినిమా బండి ఫేమ్ డైరెక్టర్ ప్రవీణ్ కండ్రేగుల తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పనులు జరుపుకుంటోంది. రీసెంట్ గా సినిమా నుండి విడుదల చేసిన ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్ లో అనుపమ లంగా ఓణి కట్టుకుని తలపైన పరదా కప్పుకుని కనిపించింది. ఆమె చుట్టూ ఉన్న అమ్మాయిలందరూ ముఖంపై పరదా వేసుకుని ఉన్నారు. దీంతో ఈ సినిమా అంచనాలను పెంచేసింది.