Samantha : స్టార్ హీరోయిన్ సమంత ఇండస్ట్రీకి వచ్చి ఏళ్లు గడుస్తున్నా ఆమె స్టార్ హీరోయిన్ గానే కొనసాగుతోంది. మయోసైటిస్ వంటి సమస్యతో బాధపడుతున్నా క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తూ యంగ్ హీరోయిన్లకు టఫ్ ఫైట్ ఇస్తోంది. ఏడాది కాలంగా సినిమాలకు దూరంగా ఉన్నా ఈ బ్యూటీ మళ్లీ తన జోరు పెంచింది. ఈ మధ్యనే తన సొంత ప్రొడక్షన్ ను స్టార్ట్ చేసిన ఈ స్టార్ బ్యూటీ ఇప్పుడు తన సీటాడెల్ ప్రాజెక్ట్ పనుల్లో బిజీగా ఉంది.
ఇదిలా ఉంటే తాజాగా ఐఎండీబీ రిలీజ్ చేసిన టాప్ 100 మోస్ట్ వ్యూడ్ ఇండియన్ స్టార్స్ లిస్ట్ లో సమంత 13వ స్థానాన్ని సొంతం చేసుకుంది. ఈ అంశంపై లేటెస్టుగా సామ్ ఓ ఇంగ్లీష్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో సామ్ చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇంటర్వ్యూలో సామ్ మాట్లాడుతూ..”ఐఎండీబీ లో 13వ స్థానాన్ని దక్కించుకోవడం చాలా ఆనందంగా ఉంది. నా కష్టానికి దక్కిన ప్రతిఫలమిది. నా కెరీర్ ఇప్పుడే స్టార్ట్ చేశానా అని అనిపిస్తోంది. ఇన్ని సంవత్సరాలు ఎలా గడిచాయో అర్థం కావట్లేదు. ఇప్పుడిప్పుడే మళ్ళీ మంచి సినిమాల్లో నటించే అవకాశాలు వస్తున్నాయి. మంచి కాంపిటీషన్ వల్ల ఆలోచనా శక్తి పెరుగుతుంది. ప్రతీ రంగంలో ఇది సహజం. నేను పక్కవారిని చూసి ఇన్ స్పైర్ అవుతాను.వారి సక్సెస్ చూసి ఇంకా ఎక్కువ కష్టపడి పనిచేయాలని అనుకుంటాను”’ అని సమంత తెలిపింది.
ఐఎండీబీలో టాప్ 15లో ఉన్న దక్షిణాది నటి సామ్. ఈ లిస్ట్ లో దీపికా పడుకోణె ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఆ తర్వాత స్థానంలో షారుఖ్ ఖాన్ ఉండగా.. ఐశ్వర్య రాయ్ మూడో స్థానంలో నిలిచింది. అలియా భట్, ఇర్ఫాన్ ఖాన్, అమీర్ ఖాన్, సుశాంత్ సింగ్ ఇలా వరుసగా టాప్ 10లో ఉన్నారు. సౌత్ బ్యూటీస్ తమన్నా , నయనతార 16, 18వ స్థానాల్లో ఉన్నారు.