Oscars-2023 : ప్రపంచవ్యాప్తంగా అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూసిన ‘ఆస్కార్ 2023′ అవార్డుల ప్రదానోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఇది 95వ అవార్డ్స్ ఫంక్షన్. లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో ఎంతో గ్రాండ్‌గా జరిగిన ఈ వేడుకల్లో చిత్ర పరిశ్రమకి చెందిన పలువురు విజయకేతనం ఎగురవేశారు. మన తెలుగు చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’ ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డ్ దక్కింది. రాజమౌళి బృందం ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఇక ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగం నుంచి ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ అవార్డును సొంతం చేసుకోవడం గొప్ప విశేషం. ఈ క్రమంలోనే 95వ ఆస్కార్ అవార్డు విజేతల పూర్తి జాబితాను ఓసారి పరిశీలిద్దాం.
ఉత్తమ ఒరిజినల్ సాంగ్: నాటు నాటు (ఆర్‌ఆర్‌ఆర్)
ఉత్తమ నటుడు: బ్రెండన్ ఫ్రాసెర్ (ది వేల్)
ఉత్తమ చిత్రం: ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్
ఉత్తమ నటుడు: బ్రెండన్ ఫ్రాసెర్ (ది వేల్)
ఉత్తమ నటి: మిషెల్ యో (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)
ఉత్తమ స్క్రీన్‌ప్లే: డానియెల్ క్వాన్, డానియెల్ స్కీనెర్ట్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)
ఉత్తమ దర్శకుడు: డానియెల్ క్వాన్, డానియెల్ షైనెర్ట్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)
ఉత్తమ సహాయ నటుడు: కి హుయ్ క్వాన్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)

ఉత్తమ సహాయ నటి: జామీ లీ కర్టిస్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)
బెస్ట్ కాస్ట్యూమ్ డెజైన్: రూథ్ కార్టర్ (బ్లాక్ పాంథర్: వకండా ఫరెవర్)
ఉత్తమ సినిమాటోగ్రఫీ: జేమ్స్‌ఫ్రెండ్ (ఆల్ క్వైట్ ఆన్‌ది వెస్ట్రన్ ఫ్రంట్)
ఉత్తమ ఎడిటర్: పాల్ రోజర్స్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)
ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ : ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్ (జర్మనీ)
బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్: ఎలిఫెంట్ విస్పరర్స్
డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ : అలెక్సీ నవానీ
బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ : అవతార్ 2 (అవతార్: ది వే ఆఫ్ వాటర్)
బెస్ట్ సౌండ్ : టాప్‌గన్: మావెరిక్
బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ : క్రిస్టియన్ ఎం గోల్డ్ బెక్ ( ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్)
బెస్ట్ మేకప్ అండ్ హెయిర్ స్టైల్: ది వేల్
బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్: పినాషియో
లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్: ఏన్ ఐరిష్ గుడ్‌బై
యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్: ద బాయ్, ద మోల్, ద ఫాక్స్, అండ్ ది హార్స్
ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే: షెరా పాల్లే (ఉమెన్ టాకింగ్)
ఒరిజినల్ స్కోర్: బ్రెటెల్‌మాన్ (ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్)