Health Tips: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి ఆరోగ్యం మీద శ్రద్ధ బాగా పెరిగింది. ఈ క్రమంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం మంచి పోషక విలువలు ఉన్న ఆహారాన్ని తీసుకుంటున్నారు. ఈ క్రమంలో బ్రౌన్ రైస్ తో పాటు మిల్లెట్స్ తో తయారు చేసిన ఆహార పదార్థాలను తీసుకుంటున్నారు. అంతే కాకుండా గత కొంతకాలంగా నల్ల గోధుమలు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఈ నల్ల గోధుముల ధర మాములు గోధుమల ధర కంటే చాలా ఎక్కువ ఉంటుంది. అంతేకాదు పోషకాలు కూడా ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా ఈ నల్ల గోధుమలు షుగర్ పేషేంట్స్ కు ఒక వరం వంటివి అని చెప్పవచ్చు.
నల్ల గోధుమలలో పోషకాలు అధికంగా ఉండి, గ్లూటెన్ తక్కువగా ఉంటుంది. ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, బి విటమిన్, ఫోలిక్ యాసిడ్, మెగ్నీషియం, కాల్షియం, జింక్, ఐరన్, కాపర్, పొటాషియం వంటివి అధికంగా ఉంటాయి. అందువల్ల నల్ల గోధుమలతో తయారు చేసిన ఆహార పదార్థాలు తినటం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు అధికంగా అందుతాయి.నల్ల గోధుమల్లో ఉండే ఫ్లేవనాయిడ్స్, కెరోటినాయిడ్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో విడుదలయ్యే ఫ్రీ రాడికల్స్ ని తగ్గిస్తాయి. దీంతో జీర్నసంబందిత సమస్యలను నివారించవచ్చు. అంతే కాకుండా క్యాన్సర్ నివారణలో నల్ల గోధుమలు ఎంతో సహాయపడతాయి.
Health Tips:
అలాగే నల్ల గోధుమలు ఆహారంగా తీసుకోవడం వల్ల శరీరంలో బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ తో పాటు కొలెస్ట్రాల్ కూడా నియంత్రణలో ఉంటుంది. వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల తొందరగా కడుపు నిండిన భావన కలుగుతుంది. బరువు తగ్గటానికి ఇవి ఎంతో సహాయకరంగా ఉంటాయి. అలాగే నల్ల గోధుమలలోని అసంతృప్త కొవ్వు ఆమ్లాలు శరీరంలో రక్తప్రసరణ సక్రమంగా జరిగేలా చేసి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. అంతేకాదు రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలను తగ్గిస్తుంది. రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది.