Wed. Nov 12th, 2025

    Health: మన శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాలలో కాలేయం (లివర్) ఒకటి. ఇది జీర్ణక్రియ, టాక్సిన్ల తొలగింపు, రక్తం గడ్డకట్టే ప్రోటీన్ల ఉత్పత్తి వంటి అనేక కీలక పనులను నిర్వహిస్తుంది. అయితే, జీవనశైలి లోపాలు, దుష్ప్రభావాల వల్ల కాలేయం దెబ్బతినే అవకాశాలు పెరిగిపోయాయి. ముఖ్యంగా, లివర్ చుట్టూ ద్రవం పేరుకునే పరిస్థితిని అసిటిస్ అంటారు. ఇది కాలేయ సంబంధిత తీవ్రమైన వ్యాధులకు సంకేతంగా పరిగణించబడుతుంది.

    ఈ సమస్య వచ్చినప్పుడు ముందుగా పొట్టలో వాపు స్పష్టంగా కనిపిస్తుంది. బిగుతుగా అనిపించడం, పొట్ట కిందకు వేలాడినట్లు కనిపించడం, మరియు బరువు ఒక్కసారిగా పెరగడం వంటి లక్షణాలు కనపడవచ్చు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చేతులు, కాళ్ల వాపు, అలసట, చర్మం మరియు కళ్ళు పసుపు రంగులోకి మారడం వంటి లక్షణాలు అసిటిస్‌ను సూచించవచ్చు.

    health-these-are-the-symptoms-of-water-accumulation-in-the-liver
    health-these-are-the-symptoms-of-water-accumulation-in-the-liver

    Health: సౌండ్‌, సీటీ స్కాన్‌, ఎంఆర్ఐ వంటి పరీక్షలు

    అలాగే, ఆకలి మందగించడం, వికారం, నాభి బయటకు రావడం వంటి సమస్యలు కూడా తలెత్తవచ్చు. ఇది నిర్లక్ష్యం చేస్తే లివర్ సిర్రోసిస్‌ వంటి ప్రమాదకరమైన పరిస్థితికి దారితీయొచ్చు. అందుకే, ఏవైనా ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. అల్ట్రాసౌండ్‌, సీటీ స్కాన్‌, ఎంఆర్ఐ వంటి పరీక్షలు ద్వారా లివర్ పరిస్థితిని అంచనా వేయవచ్చు.

    ఆరోగ్యవంతమైన లివర్‌ కోసం ఆరోగ్యకరమైన జీవనశైలి తప్పనిసరి. మద్యాన్ని దూరంగా పెట్టడం, సమతుల్యమైన ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం వంటి చర్యలు అనుసరించాలి. ఇది కేవలం సాధారణ సమాచారం మాత్రమే. ఏదైనా చికిత్స ప్రారంభించేముందు నిపుణుల సలహా తప్పనిసరిగా తీసుకోవాలి.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.