Saturday: సాధారణంగా మనం శనివారం పెద్ద ఎత్తున శనీశ్వరుడికి వెంకటేశ్వర స్వామికి పూజలు చేస్తూ ఉంటాము ఇక శనీశ్వరుడికి శనివారం ఎంతో ముఖ్యమైనది. ఈరోజు కనుక శనీశ్వరుడికి ప్రత్యేక పూజలు చేయడం వల్ల శని దోషాలు తొలగిపోయి శనీశ్వరుడి అనుగ్రహం మనపై ఉంటుందని భావిస్తుంటారు అందుకే ఈరోజు శనీశ్వరుడికి ఎంతో ఇష్టమైన పనులను చేస్తూ ఉంటారు అలాగే శని దేవుడికి కోపం తెప్పించే పనులను అసలు చేయకూడదని పండితులు చెబుతూ ఉంటారు.
ఇక శనివారం కొన్ని రకాల ఆహార పదార్థాలను తినటం వల్ల శని దేవుడు ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. అందుకే శనివారం కొన్ని ఆహార పదార్థాలను తినకపోవడమే మంచిదనీ పండితులు చెబుతున్నారు మరి శనివారం ఎలాంటి ఆహార పదార్థాలను తినకూడదు అనే విషయానికి వస్తే.. శనివారం మామిడిపండు అసలు తినకూడదు. చాలామంది ప్రతిరోజు వారి ఆహారంలో భాగంగా ఆవకాయను వేసుకొని తింటూ ఉంటారు కానీ శనివారం ఆవకాయతో తినటం వల్ల శని దేవుడికి కోపం వస్తుంది అందుకే శనివారం ఆవకాయ తినకూడదు.
ఈరోజున పెరుగుకు కూడా దూరంగా ఉండాలని చెబుతున్నారు. శనివారం రోజు పాలు పెరుగు తీసుకోవడం వల్ల ముఖ్యమైన విషయాలు ఆలస్యం అవ్వడంతో పాటు ఆటంకాలు ఏర్పడతాయని చెబుతున్నారు. మీరు శనిని సంతోషపెట్టాలనుకుంటే, మీరు శనివారాలలో ఎర్ర గింజలు తినడం మానుకోవాలి. శనివారం ఎర్రటి బీన్స్ తినడం మానుకోవడం మంచిదట. అలాగే ఎర్ర మిరపకాయలను శనివారం రోజు చేసుకోకపోవడమే ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు. శనివారం ఎర్ర మిరియాలు తింటే శని కోపం నుండి తప్పించుకోవడం అసాధ్యం అని అంటారు. అలాగే పొరపాటున కూడా శనివారం రోజు మద్యం సేవించడం లాంటివి చేయకూడదని పండితులు చెబుతున్నారు.